రూ.8 వేలలోపే స్మార్ట్‌ఫోన్.. లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!

జెడ్‌టీఈ తన కొత్త స్మార్ట్ ఫోన్ జెడ్‌టీఈ బ్లేడ్ ఏ31ను లాంచ్ చేసింది. దీని ధర రూ.8 వేలలోపే ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది రష్యాలో మాత్రమే లాంచ్ అయింది.

ప్రధానాంశాలు:జెడ్‌టీఈ బ్లేడ్ ఏ31 వచ్చేసిందిప్రస్తుతానికి రష్యాలో మాత్రమే..జెడ్‌టీఈ బ్లేడ్ ఏ31 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇది మొదట రష్యా మార్కెట్లో లాంచ్ అయింది. బడ్జెట్ ధరతో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది.

జెడ్‌టీ బ్లేడ్ ఏ31 ధర
దీని ధరను రష్యాలో 7,490 రూబుల్స్‌గా(సుమారు రూ.7,500) నిర్ణయించారు. ఇది 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. బ్లూ, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి రష్యాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 సేల్ ఈరోజే.. రూ.12 వేలలోపే సూపర్ ఫీచర్లు!
జెడ్‌టీఈ బ్లేడ్ ఏ31 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5.45 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై జెడ్‌టీఈ బ్లేడ్ ఏ31 పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఈ ఫోన్‌లో ఇంటెలిజెంట్ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్, గ్లోనాస్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ4.2, 2.4గిగాహెర్ట్జ్ వైఫై కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 166 గ్రాములుగానూ ఉంది.
ఫోన్ లాంచ్ అయిన నాలుగు నెలలకు ఓపెన్ సేల్.. రూ.5,000 తగ్గింపు కూడా!
ZTE Blade A31 స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Dimensity 800 5G – 7 nmస్టోరేజ్_ఫైల్128 GBబ్యాటరీ4000 mAhprice_in_india15825డిస్_ప్లే6.53 inches (16.58 cm)ర్యామ్6 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Dwayne Bravo తడబడ్డాడు.. కానీ ఫాబియన్ అలెన్ పట్టేశాడు

Tue Jul 13 , 2021
బౌండరీ లైన్ వద్ద వెస్టిండీస్ ఫీల్డర్ ఫాబియన్ అలెన్ లౌక్యంగా వ్యవహరించి అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. సహచర ఫీల్డర్ డ్వేన్ బ్రావో క్యాచ్ పట్టే సమయంలో తడబడగా..