చంద్రబాబుని దారుణంగా తిట్టిన ఎంపీ.. ప్రకాశం ప్రజలు ఉమ్ముతారని.!

తెలుగు రాష్ట్రాల జల జగడం ఏపీలో రాజకీయాల్లో హీట్ రాజేస్తోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ దారుణంగా తిట్టిపోశారు.

ప్రధానాంశాలు:రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకమా?సిగ్గు, ఎగ్గూ లేకుండా లేఖలా? పోగాలం దాపురించింది బాబుకి..వైసీపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలుఏపీ, తెలంగాణ జలవివాదం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారుతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ప్రకాశం జిల్లా ఎడారిగా మారబోతోందంటూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖపై విజయసాయి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎవరి తరఫున మాట్లాడుతున్నారని విజయసాయి ప్రశ్నించారు. అసలు కనీసం అర్థమవుతోందా? అంటూ ఎద్దేవా చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పచ్చ పార్టీ విమర్శించడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనని విజయసాయి అన్నారు. మనకు హక్కున్న మనకు హక్కున్న కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవాలని చూడటమేంటని ప్రశ్నించారు. అసలు మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అంటూ నిలదీశారు. చంద్రబాబుకి పోయేకాలం దాపురించిందని.. అందుకే అవాకులు, చెవాకులు పేలుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని విజయసాయి.. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు వ్యవహారం లేవనెత్తారు. సగానికి పైగా పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును గత ఐదేళ్ల కాలంలో కనీసం పట్టించుకోలేదని.. అంచనాలు పెంచి కమీషన్లు దండుకునేందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. సీఎం జగన్ వెలుగొండ ప్రాజెక్టును తుది దశకు తెచ్చారని.. రాళ్లపాడుకు రూ.650 కోట్లు కేటాయించారన్నారు. ప్రకాశం ప్రజలు ఉమ్ముతారన్న భయంతోనే సిగ్గు, ఎగ్గు విడిచి చంద్రబాబు లేఖలు రాయించాడంటూ దారుణంగా తిట్టిపోశారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడా.. మజాకా.! దెబ్బకి ఇంజనీర్ ఔట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భారత్ జట్టులో రెండో కరోనా కేసు.. క్వారంటైన్‌లోకి కోచ్‌లు

Thu Jul 15 , 2021
టీమిండియాలో కరోనా కలకలం రేగింది. ఈరోజు ఉదయం రిషబ్ పంత్ కరోనా వైరస్ బారినపడిట్లు వెలుగులోకిరాగా.. సాయంత్రానికి కోచింగ్ స్టాఫ్‌లో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దాంతో...