‘కుళ్లు మనిషి చంద్రబాబు.. అన్ని చోట్లా కులం కంపేనా?’

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి పట్టుబడినా కులం అంటగడతాడు. మనిషి కులం దృష్టితో మాత్రమే చూసే కుళ్లు మనిషి చంద్రబాబు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ప్రధానాంశాలు:ముదురుతున్న చంద్రబాబు లేఖ వ్యవహారంవిజయసాయి ఘాటు విమర్శలునిత్యానందతో చంద్రబాబు డీల్.!టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కులం పేరుతో చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ కులం అంటగడతాడని.. ఆఖరికి ట్రాఫిక్ చలాన్లు కూడా కులం ఆధారంగా రాయాలా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనిషులను కులం దృష్టితో మాత్రమే చూస్తాడని ఆయన మండిపడ్డారు.

‘‘ మనుషుల్ని కులం దృష్టితో మాత్రమే చూసే కుళ్లు మనిషి చంద్రబాబు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఎవరైనా పట్టుబడ్డా కులం అంటగడతాడు. పోలీసులనూ 'వర్గం' పేరుతో విభజిస్తూ గవర్నర్ కు లేఖ రాసే సాహసం చేశాడు. కులం ఆధారంగా కేసులు, ట్రాఫిక్ చలానాలు రాయాలా?పార్టీలో అన్ని చోట్లా కులం కంపేనా బాబూ?’’ అని విజయసాయి ప్రశ్నించారు.

రెండేళ్ల పాలన పూర్తి చేసుకోవడంపై టీడీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు విజయసాయి. అప్పట్లో ఏడాది పాలన పూర్తయితే చాలు మీడియాలో చంద్రబాబు రచ్చరచ్చ చేసేవారని ఆయన విమర్శించారు. తానిచ్చిన టాయిలెట్ లో పోస్తున్నారంటూ పొద్దు పొయ్యేవరకు సొల్లు చెప్పేవాడని ఎద్దేవా చేశారు. చెంబు, చేట, గ్లాసు, ప్లేటు, ఆకుల కట్ట అన్నీ తానే ఇచ్చాననేవాడని.. కానీ ఓటుకు నోటులో పట్టుబడ్డ పచ్చ నోట్ల పై మాత్రం నోరుమెదపడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని విజయసాయి.. దేశంలోనే అత్యంత మోసపూరితమైన, నమ్మకం కోల్పోయిన పొలిటీషియన్ చంద్రబాబేనని.. ఇక తనకు ఇక్కడ స్థానం లేదని బాబుకి అర్థమైందన్నారు. దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ బాంబు పేల్చారు. స్వయం ప్రకటిత ఐలాండ్ ఏర్పాటు చేసుకునేందుకు పారిపోయిన స్వామీజీతో చర్చలు జరుపుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంంధించారు.

Also Read: మా తాత సీఎం, మా నాన్న సీఎం.. అయినా.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఇలా చేస్తే మంచిదట..

Thu Jun 10 , 2021
కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఈ మధ్యనే కరోనా కేసులు తగ్గుముఖం చూపుతున్నాయి. ముందు అయితే నిజంగా ఘోరం అనే చెప్పాలి. రోజుకి లక్షల్లో కేసులు నమోదు అవ్వడం లాంటివి చూసాం.