పెద్ద పారిశ్రామికవేత్తని బిల్డప్, చివరికి వీటిల్లోనూ కక్కుర్తి.. ఎంపీ గల్లాపై షాకింగ్ కామెంట్స్

తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు దేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారం పేరిట గల్లా జయదేవ్ అరాచకం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో బుధవారం సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసే విజయసాయిరెడ్డి.. తాజాగా, గల్లా జయదేవ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెద్ద పారిశ్రామికవేత్తనని బిల్డప్ ఇస్తూ, చివరికి సెట్ టాప్ బాక్సుల్లో కక్కుర్తి పడ్డారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఇంత అరాచకం కనిపించదని వ్యాఖ్యానించారు.

‘‘పేద్ద పారిశ్రామికవేత్తవని బిల్డప్ ఇస్తూ చివరకు సెట్ టాప్ బాక్సుల్లో కక్కుర్తి పడ్డావేంటి గల్లా? చైనా విడిభాగాలను అసెంబుల్ చేసినందుకు అంత ధర కోట్ చేస్తావా? 12 లక్షల బాక్సుల్లో 3.4 లక్షలే పని చేస్తున్నాయట. ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఇంత అరాచకం కనిపించదు.’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.15 వేలలోపే 5జీ ఫోన్.. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ధర లీక్!

Wed Jul 14 , 2021
షియోమీ ఈ నెల 20వ తేదీన రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ ధర ఆన్‌లైన్‌లో లీకైంది. రూ.14,999కే ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.