అంతుచిక్కని లోకేష్ జాతకం.. జైలుకెళ్లేది చంద్రబాబునా, లేదా.. ఎంపీ షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి విజయసాయి తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు అందరి జాతకాలు తెలుసని చంద్రబాబు చిటికెలేస్తుంటారని.. కానీ, తన కుమారుడు లోకేష్ జాతకం ఒక్కటే అంతుబట్టడం లేదని ఎద్దేవా చేశారు. 15 నియోజకవర్గాల్లో సర్వే చేయించి, మంగళగిరిలో సేఫ్ అని దింపితే చిత్తుగా ఓడిపోయారన్నారు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో జైలుకెళ్లేది తానో లేదా తన కుమారుడు లోకేష్ అన్నది తేల్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

‘‘తనకు అందరి జాతకాలు తెలుసని చిటికెలేస్తుంటాడు చంద్రబాబు. కానీ లోకేశం జాతకం ఒక్కటే అంతుబట్టడంలేదు ఆ తండ్రికి. 15 నియోజకవర్గాల్లో సర్వే చేయించి చివరకు మంగళగిరి సేఫ్ అని దింపితే చిత్తుగా ఓడాడు. ఫైబర్ గ్రిడ్ ఫ్రాడ్‌లో జైలుకు వెళ్లేది తనా లేక జాతిరత్నమో తేల్చుకోలేకపోతున్నాడు.’’ అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతకముందు, లోకేష్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆషాడంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతుంటాయి. రాష్ట్రంలో తిరగడానికి నీకు మాత్రం ఆంక్షలేమీ లేవు లోకేశా. మీ కుటుంబ సేవకులంతా నిన్ను బాగా తిప్పాలని బాబుకు సలహాలిస్తుంటే, ఆషాఢం అంటూ చేతులకు గోరింటాకు పెట్టించుకుని ఫాం హౌజ్‌లో పడుకుంటే ఎలా చిట్టీ.’’ అంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలుగు ప్రజలకు శుభవార్త: పట్టాలెక్కుతున్న 82 రైళ్లు, 16 నెలల తర్వాత.. వివరాలివే!

Fri Jul 16 , 2021
తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు ప్రారంభించబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో 16 నెలల తర్వాత..!