ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది: వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదరగొట్టేస్తాడట.. దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. హాస్యం చేయాలనుకుని అపహాస్యం పాలవుతున్నావ్ ఈ జబర్దస్త్ కామెడీలాపి అంటూ ట్వీట్.

ప్రధానాంశాలు:రఘురామ సర్వేకు విజయసాయి కౌంటర్జబర్దస్త్ కామెడీలు ఆపాలంటూ సెటైర్లుదిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందన్న ఎంపీవైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఏపీలో సర్వేల పేరుతో జరుగుతున్న హడావిడిపై ఆసక్తికర ట్వీట్ చేశారు. లోకేష్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును పరోక్షంగా టార్గెట్ చేశారు. సర్వేల పేరుతో కామెడీలు ఆపి రాజీనామా చెయ్ అన్నారు. అపహాస్యం పాలవుతున్నావ్ అంటూ ఘాటుగా స్పందించారు.

‘ఎన్నికల ముందు కూడా చిట్టినాయుడు, జగడపాటి సర్వేలు చాలా చూశాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అదరగొట్టేస్తాడట! ఈ జబర్దస్త్ కామెడీలాపి రాజీనామా చెయ్ – దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. హాస్యం చేయాలనుకుని అపహాస్యం పాలవుతున్నావ్ 'రామ రామ'!’అంటూ పరోక్షంగా లోకేష్, రఘురామను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సర్వే పేరుతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 50 స్థానాలు దాటే పరిస్థితి లేదన్నారు. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి, చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి థ్వారకానాద్ రెడ్డి తప్ప ఎవరూ గెలిచే పరిస్థితి లేదని బాంబ్ పేల్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో గ్రంథి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీనివాసులు నాయుడు తప్ప ఎవరి పరిస్థితి సరిగా లేదన్నారు.

ఈ సర్వే ప్రస్తుతం ఇలా ఉంటే.. మళ్లీ తర్వాత పరిస్థితి మారిపోవచ్చు.. మళ్లీ 150 దాటిపోవచ్చు.. 50 కంటే తక్కువగా రావొచ్చన్నారు రఘురామ. ఈ సర్వేను తాను బయటకు తీసుకురాదలుచుకోలేదని.. కాన్ని కొందరి దిక్కుమాలిన ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి బయటపెట్టానని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాకు సంబంధించి సర్వే వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. దీనికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Train ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం!

Sat Aug 28 , 2021
ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? ఇకపై ఏసీ క్లాస్‌లో కూడా అందుబాటు ధరలోనే ప్రయాణం చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇండియన్ రైల్వేస్ కొత్త ఏసీ కోచ్‌లను తీసుకువస్తోంది.