సీఎం జగన్ మాటల్నే ఫాలో అవుతున్నా, వాళ్లే మాటతప్పి.. ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. అమరావతిపై తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో సోమవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రఘురామ.. తాను అమరావతికే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కూడా ఇదే మాట చెప్పారన్నారు.

తాను కూడా ఎన్నికల ప్రచారంలో ఇదే మాట చెప్పానని రఘురామ గుర్తు చేశారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఇళ్లు కట్టుకున్నారంటూ.. ఇక్కడే ఉంటారంటూ ప్రచారంలో చెప్పానన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ సిద్ధాంతానికే తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. అయితే, తమ నాయకులు మాత్రం మాటలు, మడమలు తిప్పేశారని ఎద్దేవా చేశారు. తాను మాత్రం అమరాతికే కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు.

ఇక, జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మీకు డయాబెటిస్ ఉందా? వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Mon Jul 12 , 2021
వర్షాకాలం అంటే వ్యాధుల సీజన్ అని అర్థం. ఈ సీజన్లో డయాబెటిస్ బాధితులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది టిప్స్ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.