అక్కడ ఫిర్యాదులు, ఇక్కడ లేఖలు.. అంతుచిక్కని రఘురామ ట్విస్టులు

వైసీపీకి కంటిలో నలుసులా తయారైన సొంత పార్టీ ఎంపీ రఘు రామకృష్ణ రాజు మరో సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే పరిస్థితి ఉప్పూనిప్పులా ఉంటే.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ సీఎం జగన్‌ని టార్గెట్ చేస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది.

ప్రధానాంశాలు:సీఎం జగన్‌‌కి లేఖ రాసిన రఘురామపింఛన్ల పెంచాలని సలహాహామీ నిలబెట్టుకోవాలని సూచనరాజద్రోహం కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మరోమారు నేరుగా సీఎం జగన్‌కి లేఖ రాసి ఆసక్తి రేపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ లేఖ సీఎం జగన్‌కి రఘురామ లేఖ రాయడం చర్చనీయాంశం మారింది. సొంత పార్టీ ఎంపీ అయి ఉండి ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న రఘురామ పింఛన్ల వ్యవహారంలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

వృద్ధాప్య పింఛన్లను తక్షణమే పెంచాలని.. ఈ నెల నుంచి రూ.2,750 చెల్లించాలని రఘురామ కోరారు. పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఇప్పటి వరకూ పెండింగ్‌ పడిన అదనపు పింఛన్ సొమ్ము రూ.3 వేలు కూడా లబ్ధదారులకు అందజేయాలని ఆయన సూచించారు.

ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి.. తీవ్రంగా హింసించారని కేంద్ర మంత్రులు, ఎన్‌హెచ్చార్సీ, లోక్ సభ స్పీకర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తనను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఢిల్లీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో హామీలు నిలబెట్టుకోవాలంటూ రఘురామ లేఖ సీఎం జగన్‌కి లేఖ రాయడం ఆసక్తి రేపుతోంది.

Also Read: స్పీడు పెంచిన రఘురామ.. జగన్‌ సర్కార్‌‌కి ఝలక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Kandikonda: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కందికొండ.. మంత్రి కేటీఆర్ తక్షణ సాయం

Thu Jun 10 , 2021
టాలీవుడ్ గేయ రచయిత కందికొండ త్రోట్ క్యాన్సర్ వ్యాధితో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి కేటీఆర్ ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.