ఏపీలో కరోనా రోగులు కోలుకున్నా ఆస్పత్రుల్లో చికిత్స.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీరియస్!

కరోనా వైరస్ నుంచి రోగులు కోలుకున్నా కూడా వారిని డిశ్చిర్జి చేయని ఆస్పత్రులపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీరియస్ అయ్యింది.

కరోనా వైరస్ చికిత్స పూర్తయినా రోగులను ఇంకా డిశ్చార్జ్‌ చేయని కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నోటీసులు జారీ చేసింది. చికిత్స పూర్తి చేసుకున్నప్పటికీ 10 నుంచి 14 రోజుల పాటు రోగులను ఉంచేసి ఆరోగ్యశ్రీ ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రస్ట్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు జారీ చేసింది.

కరోనా సోకిన రోగి కోలుకున్నప్పటికీ డిశ్చార్జి చేయకుండా ఉంచేయటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఈ నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి రోజువారీ ట్రీట్మెంట్ విధానంలో ఆస్పత్రులకు చెల్లింపులు జరపాల్సిందిగా టెక్నికల్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ .. కొన్ని ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కోలుకున్న రోగులను తక్షణమే డిశ్చార్జ్‌ చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరిపోయే శుభవార్త.. ఇక ఏ ఏజెన్సీ నుంచైనా సిలిండర్ పొందొచ్చు?

Mon Apr 26 , 2021
మీరు ఇండేన్ గ్యాస్ కస్టమరా? అయితే త్వరలోనే మీరు భారత్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే ఛాన్స్ అందుబాాటులోకి రానుంది. అదే మీరు హెచ్‌పీ గ్యాస్ వాడుతూ ఉంటే.. మీరు ఇండేన్ నుంచి సిలిండర్ డెలివరీ పొందొచ్చు.