సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన వైఎస్ షర్మిల

నిన్ననే సోషల్ మీడియా వేదికగా షర్మిల సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ మరో పోస్టు పెట్టారు.

నిత్యం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించే వైఎస్ షర్మిల .. తాజాగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వయసుతో సంబంధం లేకుండా, తెలంగాణలో వున్న ప్రతివారికీ ఉచితంగా వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

దీంతో వ్యాక్సిన్ ఉచితంగా ప్రకటించిన సిఎం కెసిఆర్ కు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. "చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం. ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని సర్కారుకు మా విజ్ఞప్తి." అంటూ షర్మిల పేర్కొన్నారు. అంతకు ముందు కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ నెంబర్‌కు కాల్ చేస్తే 2 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్!

Sun Apr 25 , 2021
గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కేవలం 2 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకోవచ్చ. అయితే ఇది కేవలం 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుంది.