కేటీఆర్ ఎవరు.. కేసీఆర్ కొడుకా..?: షర్మిల షాకింగ్ కామెంట్స్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు కేటీఆర్ ఎవరో తెలియదని అన్నారు. పక్కనే ఉన్న నేతలు కేసీఆర్ కొడుకు అనగానే ఆయనా? అంటూ నవ్వేశారు.

ప్రధానాంశాలు:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లుకేటీఆర్ ఎవరంటూ విలేకరులకు ప్రశ్నతర్వాత ఆయనా? అంటూ నవ్వేసిన షర్మిలకేటీఆర్ అంటే ఎవరు.. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మంత్రి, అంతకుమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వారుండరు. కానీ రాజన్న బిడ్డ షర్మిలకు మాత్రం కేటీఆర్ ఎవరో తెలియదంట. అవును నిజమే.. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ అంటే ఎవరు? అని ఆమె అడగడంతో పార్టీ నేతలతో పాటు విలేకరులు కంగుతిన్నారు.

Also Read: ఏపీలో రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

వివరాల్లోకి వెళ్తే… మీడియా సమావేశంలో కేసీఆర్ సర్కారు పాలనపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో విలేకరులు కేటీఆర్ గురించి ఏదో ప్రశ్న అడగ్గా.. కేటీఆరా… ఆయనెవరు? అంటూ తనకు తెలియదన్నట్లుగా మాట్లాడారు. పక్కనే ఉన్న ఓ నేత.. కల్వకుంట్ల తారక రామారావు గారు మేడమ్ అని చెప్పగా… ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా? అని నవ్వారు. షర్మిల వ్యాఖ్యలతో అక్కడున్న నేతలు, విలేకరులు కూడా నవ్వారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తండ్రి కేసీఆర్‌లాగే కేటీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పెద్ద మొగోడు కదా.. మరి మహిళలు, నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. కేటీఆర్‌కు దమ్ముంటే రాష్ట్రంలో ఖాళీవున్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

50 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న రెడ్‌మీ 10.. ఇతర ఫీచర్లు కూడా లీక్!

Fri Jul 16 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ 10 సిరీస్‌ను ఇటీవలే మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.