‘కాంట్రాక్టు కాదు దొర .. పర్మినెంట్‌ చెయ్’.. కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగాలు కాకుండా.. పర్మినెంట్‌ ‌చేయాలని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

తెలంగాణలో రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేసుకుంటున్న వైఎస్ షర్మిల నేరుగా కేసీఆర్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. ఉద్యోగ దీక్ష పేరుతో మూడు రోజుల పాటు చేపట్టిన దీక్షకు స్పందన భారీగా రావడంతో ఆమెలో మరింత ఉత్సాహం పెరిగింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు. తాజాగా కరోనా సమయంలో ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆమె ట్వీట్ చేశారు.

‘కాంట్రాక్టు కాదు దొర .. పర్మినెంట్‌గా రిక్రూట్ చెయ్. 755 అని కొసరకు కేసీఆర్ దొర .. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న 23512 ఖాళీపోస్టులు నింపు జర. కరోనా చావులతో పాటు .. నిరుద్యోగుల చావులను కొంతమేరకైనా ఆపవచ్చు’ అంటూ తెలంగాణ యాసలో షర్మిల సెటైర్లు వేశారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వ దవాఖానాలో మూడు నెలల కాంట్రాక్టుపై సిబ్బందిని రిక్రూట్ చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనపై షర్మిల ఇలా స్పందించారు.

కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూనే.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బ్రతికిన వారిని అదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం షర్మిల ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు తెలంగాణలో వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు అప్పనంగా ముట్టజెబుతున్నప్పుడు.. ప్రజల కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? అంటూ నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బంపరాఫర్.. ఉచితంగానే విమానం ఎక్కేయండి.. వీరికి మాత్రమే ఛాన్స్!

Mon Apr 26 , 2021
కరోనా వైరస్ నేపథ్యంలో విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచితంగానే విమానంలో ప్రయాణించే ఛాన్స్ కల్పిస్తోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండదు.