రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త.. తొలిసారిగా..

దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎం ఏర్పాటైంది. దీని ద్వారా సులభంగానే రేషన్ సరుకులు పొందొచ్చు. ఒకేసారి 70 కేజీల రేషన్ పొందొచ్చు. హరియాణాలో ఈ రేషన్ ఏటీఎం ఏర్పాటు చేశారు.

ప్రధానాంశాలు:రేషన్ కార్డు కలిగిన వారికి అలర్ట్కొత్త సేవలురేషన్ ఏటీఎంలు వస్తున్నాయ్రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. రేషన్ కార్డు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రేటుకే రేషన్ సరుకులు అందిస్తుంది. కేంద్రం కూడా ఇప్పుడు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

రేషన్ కార్డు కలిగిన వారు సాధారణంగా రేషన్ సరుకులకు రేషన్ షాపుల వద్దకు వెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి వద్దకే రేషన్ వస్తోంది. అయితే రానున్న కాలంలో రేషన్ ఏటీఎంలు రానున్నాయి. అంటే మీరు ఏటీఎం ద్వారా రేషన్ సరుకులు తీసుకోవచ్చు.

Also Read: రూ.369కే కొత్త స్మార్ట్‌ఫోన్.. రూ.2-3 వేలకే యాపిల్, శాంసంగ్ ఫోన్లు.. ఇలా పొందండి!

హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రేషన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి గ్రెయిన్ ఏటీఎం ఇదే. దీని వల్ల రేషన్ సరుకులు పొందే వారికే కలిగే అతిపెద్ద ప్రయోజనం.. రేషన్ తూకంలో ఎలాంటి మోసాలు ఉండవు.

ఈ ఏటీఎం ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే 70 కేజీల వరకు రేషన్ పొందొచ్చు. గురుగ్రామ్‌లోని ఫరూఖ్ నగర్‌లో ఈ ఏటీఏంను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డు కలిగిన వారు వారి చేతి వేలు పెట్టి రేషన్ సరుకులు పొందొచ్చు. ఇంకా ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఏటీఎంల ద్వారా రేషన్ ఏ సమయంలో అయినా తీసుకునే వెసులుబాటు లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Surekha Sikri Death : ఎంతో నేర్పించారు.. అవికా గోర్, పాయల్ ఎమోషనల్

Fri Jul 16 , 2021
బాలిక వధూ (తెలుగు చిన్నారి పెళ్లి కూతురు) ధారావాహికతో ప్రతీ ఇంట్లోకి వచ్చి, అందరికీ దగ్గరయ్యారు సురేఖా సిక్రీ. అంతకు ముందు ఎన్ని చిత్రాల్లో నటించినా కూడా ఈ స్థాయి ఆదరణ దక్కలేదు.