రూ.లక్ష పెడితే రూ.కోటి.. కళ్లుచెదిరే లాభం!

రూ.లక్షకు రూ.కోటి.. అది కూడా పదేళ్లలోనే. ఇది భారీ లాభం అని చెప్పొచ్చు. అయితే ఇలా అని చోట్ల జరగదు. కానీ స్టాక్ మార్కెట్‌లో మాత్రం ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి.

ప్రధానాంశాలు:రూ.లక్షకు రూ.కోటిభారీ లాభంపదేళ్లలోనే కళ్లుచెదిరే రాబడిడబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అది కూడా ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా భారీ లాభం పొందాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే స్టాక్ మార్కెట్‌లో కళ్లుచెదిరే లాభం పొందాలన్నా.. ఉన్న డబ్బులు పొగొట్టుకోవాలన్నా.. స్టాక్ మార్కె్ట్‌ను మించిన ఆప్షన్ మరొకటి ఉండదు.

దీపక్ నైట్రెట్ అనే ఒక షేరు ఇన్వెస్టర్ల పంట పండించింది. భారీ లాభాన్ని అందించింది. గత పదేళ్ల కాలంలో ఈ షేరు ఏకంగా 10413 శాతం పరుగులు పెట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాన్ని అర్జించి పెట్టింది. ఏకంగా కోటీశ్వరులను చేసింది.

Also Read: రూ.74 పొదుపుతో రూ.10 లక్షలు పొందండిలా.. అదిరే స్కీమ్!

2011 జూలై 8న షేరు ధర రూ.18 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు ఈ షేరు ధర ఏ స్థాయిలో ఉందో తెలిస్తే నోరెళ్లబెడతారు. షేరు ధర 2021 జూలై 9న రూ.1945కు చేరింది. అంటే మీరు పదేళ్ల కింద ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీకు రూ.1.05 కోట్లు వచ్చేవి.

మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. ఈ షేరు ధర రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని తెలుస్తోంది. ఈ షేరు రానున్న కాలంలో రూ.2100 స్థాయికి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. భారీ రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వన్‌ప్లస్ నార్డ్ 2 ధర లీక్.. మొదటిసారి ఆ ధరతో నార్డ్ సిరీస్ ఫోన్!

Wed Jul 14 , 2021
వన్‌ప్లస్ తన కొత్త బడ్జెట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2ను ఈ నెల 22వ తేదీన లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీని ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.