ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా యడ్యూరప్ప..? బీజేపీ కొత్త ఎత్తుగడ, టార్గెట్ అదే

తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనం అవుతోంది. బీజేపీ ఏపీలో ఎంతో కొంత ఎదగాలి అనుకుంటున్న క్రమంలో ఈసారి నామ్ కే వాస్తే గవర్నర్ ను పెట్టకూడదని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ప్రధానాంశాలు:ఏపీ కొత్త గవర్నర్‌గా యడ్యూరప్పకర్ణాటక రాజకీయ పరిణామాలతో బీజేపీ కొత్త ఎత్తువైసీపీకి చెక్ పెట్టే ప్లాన్‌ అంటున్న రాజకీయ విశ్లేషకులుఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ పదవీ కాలం జూలై 23 తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పొడిగించే యోచనలో లేనట్లు కనిపిస్తుండటంతో గవర్నర్ మార్పు కచ్చితమని తెలుస్తోంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనం మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని బీజేపీ ప్రణాళికలు వేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి గట్టి నేతనే గవర్నర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: ‘రూ.లక్ష కోట్ల స్కామ్‌కి జగన్ స్కెచ్… ఆ కంపెనీ వైసీపీ ఎంపీ బినామీది’.. టీడీపీ నేత సంచలన ఆరోపణలు

ఒకవేళ బెయిల్ రద్దయి జగన్ జైలుకు వెళ్తే పరోక్షంగా పరిపాలన సాగించేటంత సత్తా కలిసి నేతను గవర్నర్‌గా పంపాలని కేంద్రం ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ తాజా గవర్నర్‌గా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేరు బాగా వినిపిస్తోంది. కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యడ్యూరప్పపై చాలామంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నన తరుణంలో ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడం బీజేపీకి అనివార్యంగా కనిపిస్తోంది.

అయితే బలమైన నేతగా పేరొందిన యడ్యూరప్పను సీఎం పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారన్న అపఖ్యాతి కన్నడ ప్రజల నుంచి రాకుండా బీజేపీ అధిష్ఠానం సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బిశ్వభూషన్ స్థానంలో ఏపీకి గవర్నర్‌గా పంపించడం ద్వారా యడ్యూరప్పకు సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. వైఎస్ జగన్‌ సన్నిహితుడని చెప్పుకునే గాలి జనార్ధన్‌రెడ్డికి యడ్యూరప్పకు మంచి సంబంధాలున్నాయి.

దీంతో జగన్‌తో సయోధ్యలో భాగంగానే యడ్యూరప్పను ఏపీ గవర్నర్‌గా పంపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే మరో మూడేళ్లలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీని ఇరుకున పెట్టి తాము బలపడాలన్న ప్లాన్‌లో భాగంగానే బీజేపీ అధిష్ఠానం యడ్యూరప్పను ఏపీకి పంపిస్తోందన్న అభిప్రాయం కొందరు వ్యక్తపరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గనిలో పనిచేసే కార్మికులతో వెళ్తోన్న బస్సు బోల్తా.. 27 మంది మృతి

Sat Jun 19 , 2021
గనుల్లో పనిచేసే కార్మికులను తీసుకెళ్తోన్న ఓ బస్సు ప్రమాదానికి గురయి బోల్తాపడింది. అనంతరం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.