మందుబాబులకు షాక్.. మద్యం షాపులు బంద్

పోలింగ్‌కు 48 గంటల ముందు… మద్యం షాపులన్నింటిని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అదేశిధంగా కౌంటింగ్ రోజు కూడా మద్యం షాపులు తెరవకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రధానాంశాలు:ఈనెల 30 మన్సిపల్ ఎన్నికలుపోలింగ్‌కు 48 గంటలు ముందు మద్యం బంద్కౌంటిగ్ రోజు బెల్ట్ సాపులు, మద్యం షాపులు మూసివేత తెలంగాణలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. పోలింగ్ కు 48 గంటల ముందు..కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు..బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు తెరొవద్దని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతికి మించి మద్యం ఉండరాదని ఆదేశాలు కూడా జారీ చేసింది.

50 శాతానికి మించి మద్యం అమ్మకాలు జరిగితే.. ప్రత్యేక నిఘా పెట్టాలని పార్థసారధి సూచించారు. ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి..అక్రమ మద్యం రవాణాను నివారించాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని నిబంధనలను అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉప ఎన్నికపైనా కూడా ఆయన సమీక్షించారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SBI కస్టమర్లకు శుభవార్త.. బ్యాంక్ కీలక నిర్ణయం.. కొత్త సర్వీసులు అందుబాటులోకి!

Tue Apr 27 , 2021
మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మీరు నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఓటీపీ ఉండాలి.