కోవిడ్ ముప్పు తగ్గిందనుకుంటే పొరపాటే.. WHO చీఫ్ సైంటిస్ట్ హెచ్చరిక

Covid-19 కరోనా వైరస్ మొదలై ఏడాదిన్నర దాటిపోయినా ప్రపంచానికి ఇంకా ముప్పు తొలగిపోలేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని డబ్ల్యూహెచ్ఓ వివిధ దేశాలకు సూచించింది.

ప్రధానాంశాలు:కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచదేశాలకు హెచ్చరిక.మహమ్మారి కోరలు చాస్తోందని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్య.24 గంటల్లో దాదాపు పది వేల కోవిడ్ మరణాలు.కోవిడ్-19 ప్రభావం తగ్గిపోయిందనుకోవడం పొరపాటే అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని.. దీన్ని దృఢపరిచే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడానికి డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి, మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణమని తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్లలో నుంచి బయటకు రావాలని సూచించారు.

బ్లూమ్‌బర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్యా స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘కరోనా రక్కసి కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. డబ్ల్యూహెచ్‌వో ఆరు రీజియన్లలో ఐదింటిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. గడచిన రెండు వారాల్లో ఆఫ్రికాలో కరోనా మరణాల 30 నుంచి 40 శాతానికి పెరిగాయి.. గత 24 గంటల్లో 5 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

అలాగే వైరస్ బారిన పడి 9,300 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి క్షీణించడం మొదలైందని ఎలా అంటాం? డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, భౌతికదూరాన్ని పాటించకపోవడం, లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం వల్ల కరోనా మళ్లీ విజృంభిస్తోంది’ అని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.

పలు దేశాలు ఆంక్షలు సడలింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని, లాక్‌డౌన్ ప్రయోజనాలను నష్టపోకుండా చూసుకోవాలని ఆమె కోరారు. యూకేలో జూలై 19 నుంచి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తుండగా.. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం వంటి కోవిడ్ నిబంధనలు వ్యక్తిగత ఎంపికగా మారతాయి. కేసులు తగ్గడంతో అమెరికా, ఐరోపాలో చాలా భాగం ఆంక్షలను ఎత్తివేశారు.

‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని, సాధారణ స్థితికి చేరుకున్నామనే ఆలోచన ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది చాలా ప్రమాదకరమైంది’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తల్లిగా మారనున్న కాజల్ అగర్వాల్.. అయోమయ స్థితిలో ఫ్యాన్స్.. అసలు విషయం ఏంటంటే..

Sat Jul 10 , 2021
టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్‌కు ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఆమెకు పెళ్లి జరిగిందని తెలియడమే ఆలస్యం ఎంతో మంది ఫ్యాన్స్ బాధలో కూరుకుపోయారు. అయితే తాజాగా కాజల్ తల్లి కాబోతుందట.. ఈ వార్త ఆమె ఫ్యాన్స్‌ని మరింత షాక్‌కి గురి చేస్తోంది.