24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్.. స్నాప్‌చాట్ తరహా ఫీచర్ వాట్సాప్‌లో?

ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. వాట్సాప్ డిజప్పియరింగ్ మెసేజెస్‌ను 24 గంటలకు తగ్గించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ప్రస్తుతం ఏడు రోజుల టైం లిమిట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.

ప్రధానాంశాలు:ప్రస్తుతం ఏడురోజులకే ఆటో డిలీట్దీన్ని 24 గంటలకు తగ్గించే ప్రయత్నంవాట్సాప్ ప్రైవసీని మెరుగు పరిచేందుకు కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్ డిజప్పియరింగ్ మెసేజెస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మీరు పెట్టిన మెసేజ్‌లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని 24 గంటలకు తగ్గించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo కథనం ప్రకారం… ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే వాట్సాప్ 7 రోజుల ఆప్షన్‌ని పూర్తిగా తీసేయడం లేదు. వినియోగదారులు 7 రోజులు, 24 గంటలు.. ఈ రెండు ఆప్షన్లలో నచ్చినదాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు.
వివో వై21 5జీ లాంచ్ తేదీ వచ్చేసింది.. ఫీచర్లు కూడా టీజ్ చేసిన కంపెనీ!
ఒకవేళ 24 గంటల ఆప్షన్‌ను ఎంచుకుంటే మెసేజెస్ 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌‌గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలో ఐవోఎస్, ఆండ్రాయిడ్, డెస్క్ టాప్, వెబ్‌లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. స్నాప్ చాట‌్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ కూడా ఇదే ఫీచర్‌ను ఇప్పుడు తీసుకురావడం అంత ఆశ్చర్యకరమేమీ కాదు.

దీంతోపాటు వాట్సాప్ కొత్తగా మళ్లీ తన సేవా నియమాలకు సంబంధించిన అలెర్ట్‌ను యాప్‌లో అందించనుంది. గతంలో వీటిని యాక్సెప్ట్ చేయని ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ అలెర్ట్ వస్తోందని తెలుస్తోంది.

భవిష్యత్తులో వాట్సాప్ వినియోగదారులు తమ చాట్లను ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల మధ్య కూడా మార్చుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. మల్టీ డివైస్ సపోర్ట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా కొత్త ఫోన్ కొన్నప్పుడు వినియోగదారులు చాట్ బ్యాకప్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
ఎంఐ 11ఎక్స్ ప్రో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. అదిరిపోయే కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నెలకు రూ.వెయ్యి కడితే.. చేతికి ఏకంగా రూ.10 లక్షలు.. ఎలాగంటే?

Mon Apr 26 , 2021
ప్రతి నెలా తక్కువ మొత్తంతోనే రూ.లక్షలు పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. నెలకు రూ.1000తో చేతికి ఏకంగా రూ.10 లక్షలు పొందొచ్చు. అయితే దీనికి సహనం ఉండాలి. చాలా కాలం ఇన్వెస్ట్ చేయాలి.