ఎన్టీఆర్ ఇచ్చిన షాక్‌కి సోషల్‌మీడియా వదిలేసిన బ్యూటీ.. అమీర్ ఖాన్‌ని ఫాలో అవుతోందట

ఈ మధ్యకాలంలో ఏదైన అనుకోనిది జరిగితే సోషల్‌మీడియాను వదిలేస్తున్నారు సెలబ్రిటీలు. వీరిలో కొందరు కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్లీ సోషల్‌మీడియాకి ఎంట్రీ ఇస్తుంటే.. కొందరు మాత్రం శాశ్వతంగా తమ అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ వారినా హుస్సేన్ కూడా సోషల్‌మీడియాకు గుడ్‌బై చెప్పింది.

‘లవ్‌యాత్రీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అఫ్గానిస్థాన్‌కు చెందిన బ్యూటీ వారినా హుస్సేన్. ఆ తర్వాత సల్మాన్ నటించిన ‘దబాంగ్-3’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో మెరిసిందీ భామ. అయితే ఈ బ్యూటీ సోషల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే అందుకు ప్రత్యేకమైన కారణాలు ఏంటనే విషయాన్ని వెల్లడించలేదు. గత నెల బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ సోషల్‌మీడియాను వదిలేశారు. ఇప్పుడు తాను కూడా ఆయన్నే ఫాలో అవుతున్నట్లు వారినా ప్రకటించింది.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని వార్తలు గట్టిగా వినిపించాయి. తారక్ కెరీర్‌లో 30వ సినిమాగా రూపొందే ఈ సినిమాలో వారినానే హీరోయిన్‌గా అనుకున్నారట. త్రివిక్రమ్ ఏరికోరి మరీ ఈ భామని సెలక్ట్ చేశారని టాక్. అయితే ఇప్పుడు త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయింది. తన 30వ సినిమాని ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్‌తో సినిమా అనగానే.. వారినాకు సోషల్‌మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంతో ఆమె సోషల్‌మీడియాను వదిలేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

‘‘అనుమతి తీసుకొని వెళ్లిపోవడానికి ఇది ఎయిర్‌పోర్ట్ కాదు. కానీ నా మిత్రులు, అభిమానుల కోసం నేను ఇది ముందే ప్రకటిస్తున్నాను. వాళ్లే నాకు బలం. ఇకపోతే ఇదే నా చివరి పోస్ట్. నా టీమ్ నా సోషల్ మీడియా ఖాతాను కొనసాగిస్తారు. తద్వారా నా సినిమాలకు సంబంధించిన సమాచారం మీకు తెలుస్తుంది’’ అంటూ పోస్ట్ చేసిన వారినా.. ‘పీస్ అవుట్’ అంటూ హెడ్డింగ్ పెట్టింది. ఇక గత నెలలో సోషల్‌మీడియా నుంచి వైదొలగుతున్నట్లు అమీర్‌ఖాన్ ప్రకటించారు. ఇప్పుడు వారినా కూడా ఆయన స్టైల్‌లోనే ఫాలో అవుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటూ నెటిజన్లు అంటున్నారు.
View this post on Instagram A post shared by WARINA HUSSAIN (@warinahussain)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి హెచ్చరిక.. ఇక ఇలా చేస్తేనే మీ ఇంటికి సిలిండర్.. కానీ..

Mon Apr 26 , 2021
మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డ్యాక్ కోడ్ వస్తుంది. దీన్ని డెలివరీ బాయ్‌కు చెబితేనే సిలిండర్ ఇస్తారు. లేదంటే లేదు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఈ కోడ్‌ను అడగడం లేదు.