రూ.12 వేలలోపే వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వై12ఏను లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతానికి థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ప్రధానాంశాలు:వివో వై12ఏ వచ్చేసిందిప్రస్తుతానికి థాయ్‌ల్యాండ్‌లో మాత్రమేవివో వై12ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. గత నెలలో వియత్నాంలో లాంచ్ అయిన వివో వై12ఎస్ 2021కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు.

వివో వై12ఏ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 4,499 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా(సుమారు రూ.11,800) నిర్ణయించారు. బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఈ శాంసంగ్ సూపర్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గింపు.. ఇప్పుడు ఎంతకు కొనొచ్చంటే?
వివో వై12ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5W రివర్స్ చార్జింగ్‌ను కూడా ఇందులో అందించారు. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ 2.0, 3.5 ఎంఎం ఆడియోజాక్ కూడా ఇందులో ఉన్నాయి.
నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్‌డే సందర్భంగా వాట్సాప్ ప్రత్యేక ఫీచర్!
Vivo Y12A స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్Qualcomm Snapdragon 460డిస్_ప్లే6.51 inches (16.53 cm)స్టోరేజ్_ఫైల్64 GBకెమెరాా13 MP + 2 MPబ్యాటరీ5000 mAhprice_in_india18555ర్యామ్4 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Rishabh Pantకి వీవీఎస్ లక్ష్మణ్ మొట్టికాయలు.. ఓపిక పట్టాలని హితవు

Mon Jun 21 , 2021
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రిషబ్ పంత్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ఊరిస్తూ వచ్చిన బంతిని డ్రైవ్ చేయబోయిన పంత్.. పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు.