జూన్ 24వ తేదీన వివో కొత్త ఫోన్.. రూ.15 వేలలోనే 5జీ ఫోన్!

వివో తన కొత్త 5జీ ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే వివో వీ21ఈ 5జీ. దీని ధర రూ.15 వేలలోనే ఉండే అవకాశం ఉంది. జూన్ 24వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది.

ప్రధానాంశాలు:వివో వీ21ఈ 5జీ వచ్చేస్తుందిఅమోఎల్ఈడీ డిస్‌ప్లే అందిస్తున్న కంపెనీవివో కొత్త ఫోన్ వీ21ఈ 5జీ మనదేశంలో లాంచ్ కానుంది. జూన్ 24వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో వీ21ఈ 4జీ గ్లోబల్ లాంచ్ కొన్ని నెలల క్రితం జరిగింది. 4జీ వెర్షన్ కంటే 5జీ వెర్షన్ కాస్త డిఫరెంట్‌గా ఉండనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నాడు. విరాట్ కోహ్లి ఉన్న పోస్టర్‌ను వివో తన ట్వీటర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. వివో వీ21ఈ స్మార్ట్ ఫోన్ లైట్ బ్లూ కలర్ వేరియంట్‌ను విరాట్ కోహ్లి చేతిలో చూడవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ధర రూ.15 వేల రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉండనుంది.
కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేయనున్న రియల్‌మీ.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
వివో వీ21ఈ 5జీ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇందులో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, 5జీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

వివో వీ21ఈ 4జీ స్మార్ట్ ఫోన్ కొద్ది కాలం క్రితమే మలేషియాలో లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 1,299 యువాన్లుగా(సుమారు రూ.23,000) నిర్ణయించారు. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఒప్పో రెనో 6జెడ్ స్పెసిఫికేషన్లు లీక్.. మిడ్‌రేంజ్‌లో సూపర్ ఫీచర్లతో?
Vivo V21e 5G స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek MT6833 Dimensity 700 5G (7 nm)డిస్_ప్లే6.44 inches (16.35 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా64 MP + 8 MPబ్యాటరీ4000 mAhprice_in_india23690ర్యామ్8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీఎం యడ్డీ కొడుకు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

Sat Jun 19 , 2021
Karnataka Crisis నాయకత్వ మార్పుపై రెండు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన బీజేపీ ఇంఛార్జ్ అరుణ్‌సింగ్‌.. చివరి రోజు శుక్రవారం సీనియర్లతో సమావేశమై.. భవిష్యత్తు ప్రణాళికను వివరించారు.