వివో ఎస్10 సిరీస్ ఫీచర్లు లీక్.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఎస్10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రధానాంశాలు:జులై 15వ తేదీన లాంచ్ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా..
వివో ఎస్10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 15వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. V2121A మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం వివో ఎస్10 ప్రోలో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు.

అయితే ఈ ఫోన్ సైజ్ తెలియరాలేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ట్వీటర్‌లో ప్రముఖ టిప్‌స్టర్ ఈ విషయాన్ని లీక్ చేశారు.

ఈ ఫోన్ ధర కూడా లీక్ అయింది. దీని ధర 3,000 యువాన్లుగా(సుమారు రూ.34,500) ఉండే అవకాశం ఉంది. చైనా సర్టిఫికేషన్ సైట్ టెనాలో కూడా ఈ ఫోన్ ఇటీవలే కనిపించింది. ఈ ఫోన్‌లో 5జీ సపోర్ట్ కూడా ఉండనుంది. ఈ ఫోన్ 0.72 సెంటీమీటర్ల మందం ఉండనుంది.
రూ.599 విలువైన ఇయర్‌ఫోన్స్ రూ.99కే.. ఎంఐ సూపర్ ఆఫర్!
వివో ఎస్10 ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ముందువైపు 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

వివో ఎస్10 స్పెసిఫికేషన్లు(అంచనా)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని సమాచారం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 44W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఇందులో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌నే అందించనున్నారు. వివో ఎస్9లో కూడా ఇదే ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
రియల్‌మీ బుక్ ధర లీక్.. ఫీచర్లు కూడా.. లాంచ్ త్వరలోనే!
Vivo S10 Pro స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek MT Helio P70 (12nm)స్టోరేజ్_ఫైల్256 GBబ్యాటరీ5000 mAhprice_in_india50988డిస్_ప్లే6.5 inches (16.51 cm)ర్యామ్8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీఎం సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌‌‌ ఓవరాక్షన్... సీఎస్ దాస్ దిమ్మతిరిగే రియాక్షన్

Wed Jul 14 , 2021
ప్రస్తుతం ఏపీభవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న అభయ్‌ త్రిపాఠి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ ఏపీభవన్‌కు వెళ్తారనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది