వివో ఎస్10 సిరీస్ వచ్చేసింది.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

వివో తన ఎస్10 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. వివో ఎస్10, ఎస్10 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. వివో ఎస్10 ప్రోలో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ప్రధానాంశాలు:వివో ఎస్10, ఎస్10 ప్రో వచ్చేశాయ్ఎస్10 ప్రోలో 108 మెగాపిక్సెల్ కెమెరావివో ఎస్10, ఎస్10 ప్రో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వివో ఎస్-సిరీస్‌లో లేటెస్ట్ మోడల్స్ ఇవే. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్లూ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్లను రెండు ఫోన్లలోనూ అందించారు. వీటిలో 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఐఫోన్ 12 సిరీస్ తరహాలో ఫ్లాట్ ఫ్రేం డిజైన్‌ను ఇందులో అందించారు. వివో ఎస్10 ప్రోలో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

వివో ఎస్10, ఎస్10 ప్రో ధర
వివో ఎస్10లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా(సుమారు రూ.32,300) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా(సుమారు రూ.34,600) ఉంది.

వివో ఎస్10 ప్రోలో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 3,399 యువాన్లుగా(సుమారు రూ.34,600) ఉంది. బ్లాక్, గ్రేడియంట్, లైమ్, వెల్వెట్ రంగుల్లోనే ఈ రెండు ఫోన్లూ కొనుగోలు చేయవచ్చు. ఇవి మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలియరాలేదు.
స్మార్ట్‌టీవీల ధరలు భారీగా పెంపు.. ఏకంగా 15 శాతం పైగా పెంచిన ప్రముఖ బ్రాండ్!
వివో ఎస్10 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. హెచ్‌డీఆర్10+ వీడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 44 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను అందించారు.
రూ.18 వేలలోపే ల్యాప్‌టాప్.. లాంచ్ చేసిన అసుస్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఇందులో 4050 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ ఇందులో అందించారు. 5జీ. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.

వివో ఎస్10ప్రో స్పెసిఫికేషన్లు
వివో ఎస్10 తరహాలోనే దీని స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అయితే ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. అలాగే ఇందులో అదనంగా ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌‌ను కూడా అందించారు.
50 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న రెడ్‌మీ 10.. ఇతర ఫీచర్లు కూడా లీక్!
Vivo S10 Pro స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek MT Helio P70 (12nm)స్టోరేజ్_ఫైల్256 GBబ్యాటరీ5000 mAhprice_in_india50988డిస్_ప్లే6.5 inches (16.51 cm)ర్యామ్8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అంతుచిక్కని లోకేష్ జాతకం.. జైలుకెళ్లేది చంద్రబాబునా, లేదా.. ఎంపీ షాకింగ్ కామెంట్స్

Fri Jul 16 , 2021
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.