బంపరాఫర్.. ఉచితంగానే విమానం ఎక్కేయండి.. వీరికి మాత్రమే ఛాన్స్!

కరోనా వైరస్ నేపథ్యంలో విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉచితంగానే విమానంలో ప్రయాణించే ఛాన్స్ కల్పిస్తోంది. ఇది అందరికీ అందుబాటులో ఉండదు.

ప్రధానాంశాలు:ఉచితంగానే విమానంలో ప్రయాణించండిఅదిరిపోయే ఆఫర్వారికి మాత్రమే అందుబాటులోఅదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఉచితంగానే విమానంలో ప్రయాణించే అకాశముంది. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం కొంత మందికే ఈ ఛాన్స్ లభిస్తోంది. డాక్టర్లు, నర్సులకు ఉచిత విమాన ప్రయాణం ఆఫర్ అందుబాటులో ఉంది.

విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగానే విమానంలో ప్రయాణించొచ్చు.

Also Read: బంగారం కొనే వారికి భారీ ఊరట..!

విస్తారా ఎయిర్‌లైన్స్ ఈమేరకు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి ఉత్తరం రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది.

అయితే విస్తారా ఎయిర్‌లైన్స్ ఒక విషయాన్ని తెలియజేసింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కోవిడ్ 19 శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విస్తారా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

డేవిడ్ వార్నర్‌పై ఈషా రెబ్బ ట్వీట్.. ఒక్కసారిగా అంత మాటనేసింది ఏంటీ..!

Mon Apr 26 , 2021
ఐపీఎల్ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. ప్రతీ రంగంలోనూ విఫలమవుతూ.. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిపాలైంది.