ఆ హీరోయిన్‌ అంటే పిచ్చి.. ఎప్పటికైనా ఆమె నా క్రష్ అంటున్న ‘మాస్ కా దాస్’

‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నామా దాస్’ సినిమాలతో యూత్‌కి చేరువయ్యాడు నటుడు విశ్వక్‌సేన్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజీతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. అయితే ఎందరో ఫ్యాన్స్ ఉన్న విశ్వక్ మాత్రం ఓ హీరోయిన్ అంటే పడి చచ్చిపోతాడట.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన విశ్వక్‌సేన్.. ఆ తర్వాత వచ్చిన ‘ఫలక్‌నామా దాస్’ సినిమాతో మాస్‌లో క్రేజ్ సంపాదించడమే కాక.. ఆ సినిమాతో ‘మాస్ కా దాస్’ అనే పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత అతను ‘హిట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు విశ్వక్.

అయితే ఎంతో మంది అభిమానులు ఉన్న విశ్వక్‌సేన్‌కు ఓ హీరోయిన్ అంటే మాత్రం వీర అభిమానం అట. చిన్నతనం నుంచి ఇప్పటివరకూ ఆమె తన అభిమాన నటి అంటున్నాడు విశ్వక్. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. గోవా బ్యూటీ ఇలియానా. ఇలియానాపై తనకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేనని చెబుతున్నాడు విశ్వక్‌సేన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

‘‘చిన్నప్పటి నుంచి ఇలియానా అంటే పిచ్చి. ఆమె పోస్టర్లు ఎక్కడ కనిపించినా.. ఆగకుండా వెంటనే ఇంటికి తెచ్చుకొనే వాడిని. ఆమె ఫోటోషూట్‌లు ఏది మిస్ కాలేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నా మనస్సు మారలేదు. ఇలియానాపై అభిమానం అలాగే ఉంది. నా క్రష్ ఎప్పటికీ ఆమెనే’’ అని విశ్వక్ చెప్పాడు.

ఇక విశ్వక్ త్వరలో ‘పాగల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందకు రానున్నాడు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరీ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. ఇక ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఓ మై కడవులే’ సినిమా రీమేక్‌లో కూడా అతను నటిస్తున్నట్లు సమాచారం. అయితే కొంతకాలం క్రితం ‘కప్పెళ’ సినిమా రీమేక్‌లో కూడా అతను నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది అవాస్తవమని విశ్వక్ స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఐకూ 7 సిరీస్ వచ్చేసింది.. ఎంఐ 11ఎక్స్, వన్ ప్లస్‌ 9 సిరీస్‌కు సరైన పోటీ!

Mon Apr 26 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అవే ఐకూ 7, ఐకూ 7 లెజెండ్ ఎడిషన్. వీటి ధర రూ.31,990 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.