ఆత్మహత్య చేసుకుంటా.. అభిమాని బెదిరింపులకు విశ్వక్ సేన్‌ షాక్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విశ్వక్ సేన్ తాజాగా తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేశాడు. అందులో ఓ నెటిజన్ విశ్వక్ సేన్‌ను బెదిరించారు. ఆత్మహత్య చేసుకుంటానని విశ్వక్ సేన్‌ను హడలెత్తించేశాడు. దానికి విశ్వక్ సేన్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.

ప్రధానాంశాలు:సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ యాక్టివ్పాగల్‌తో రచ్చకు రెడీఫాలోవర్లతో విశ్వక్ ముచ్చట్లుమాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్ మీద ఎంతటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందో.. అంతే స్థాయిలో పాజిటివిటీ కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండను ఎందుకు ఫాలో అవుతుంటావ్ అని నెట్టింట్లో ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు. విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటారు. ఫలక్ నుమా దాస్ అనే సినిమాతో విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నారు.
ఆ పదంతో హీరోయిన్, పాట స్థాయి రెండూ పెరిగాయ్.. ‘కాటుక కనులే’పై భాస్కర భట్ల కామెంట్స్
HIT సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కేశారు. అలా ఇప్పుడు విశ్వక్ సేన్ తన రూట్ మార్చేశారు. మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశ్వక్ ఇప్పుడు లవర్ బాయ్‌గా మారిపోయేందుకు రెడీగా ఉన్నారు. పాగల్ సినిమాతో విశ్వక్ సేన్ ప్రేమ కథా చిత్రంతో కొత్తగా కనిపించబోతోన్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. పాగల్ అనే టైటిల్ విశ్వక్ సేన్‌కు కరెక్ట‌గా సూట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు పెట్టేశారు.

తాజాగా విశ్వక్ సేన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశారు. అందులో తన ఫాలోవర్లు అడిగిన వింత వింత ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధానాలు పెట్టేశారు. ఇంకా కొంత మంది తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని అలిగిపోయారు. హర్ట్ అయ్యామంటూ మళ్లీ కామెంట్లు పెట్టేశారు. అలా అందరి ప్రశ్నలకు విశ్వక్ సేన్ సమాధానాలు ఇస్తూ వెళ్లారు.

బిర్యానీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. పాగల్ ట్రైలర్ రెడీ అవుతోందని, ఓ మై కడవులే అనే సినిమా రీమేక్ 30 శాతం పూర్తయిందని ఇలా తన సినిమా అప్డేట్ల ప్రశ్నలకు సమాధనాలు ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ మాత్రం విశ్వక్ సేన్‌ను హడలెత్తించాడు. ఎంత సేపటికి విశ్వక్ సేన్ రిప్లై ఇవ్వకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను అని హెచ్చరించారు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని తన స్టైల్లో కౌంటర్ వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Potti Veeraiah టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇకలేరు

Sun Apr 25 , 2021
టాలీవుడ్‌లో నటుడు పొట్టి వీరయ్య ఇకలేరు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. పొట్టి వీరయ్య తన దైన శైలిలో నటించి అందరినీ నవ్వించేశారు. గతంలో చిరంజీవి ఆర్థిక సాయం కూడా అందించారు.