తృటిలో తప్పిన ప్రమాదం.. యాక్షన్ సీక్వెన్స్‌లో విశాల్ జోరు!

విశాల్ హీరోగా ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విశాల్ ప్రస్తుతం కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అయితే చివరగా చక్ర అంటూ వచ్చిన విశాల్ అంతగా మెప్పించలేకపోయారు.

ప్రధానాంశాలు:టాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడితృటిలో తప్పిన ప్రమాదంయాక్షన్ సీక్వెన్స్‌లో విశాల్ జోరు!విశాల్ హీరోగా ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విశాల్ ప్రస్తుతం కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అయితే చివరగా చక్ర అంటూ వచ్చిన విశాల్ అంతగా మెప్పించలేకపోయారు. అంతకు ముందు వరుస హిట్లతో విశాల్ దూసుకుపోయారు. డిటెక్టివ్, అభిమన్యు, పందెం కోడి 2 అంటూ సూపర్ హిట్లను అందుకున్నారు. అయితే విశాల్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. డిటెక్టివ్ సీక్వెల్ పనుల్లోనూ విశాల్ రచ్చ చేస్తున్నారు. మిస్కిన్ తప్పుకోవడం దర్శకత్వ బాధ్యతలను విశాల్ భుజానికెత్తుకున్నారు.
ఇంతకంటే ఏం కావాలంటూ పోస్ట్.. సరైన పార్ట్నర్‌తో ఉన్నానంటోన్న కీర్తి సురేష్
విశాల్ ఇప్పుడు ఆర్యతో కలిసి మల్టిస్టారర్ చేస్తున్నారు. ఎనిమీ అంటూ ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో విశాల్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేస్తున్నారు. మధ్యలో కరోనా ఉధృతంగా పెరగడంతో షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగు పడుతుండటంతో షూటింగ్‌లు మొదలయ్యాయి.

తాజాగా విశాల్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఇందులో తృటిలో తనకు ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తు తప్పించుకున్నానని విశాల్ చెప్పుకొచ్చారు. స్టంట్ ఆర్టిస్ట్‌ల తప్పేమీ లేదు.. జస్ట్ టైమింగ్ మిస్.. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇలాంటివి జరుగుతుంటాయి. దేవుడి దయ, మీ ప్రేమతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశాం.. ఫైట్ సీక్వెన్స్ చేసేశాం.. హైద్రాబాద్‌లోనే షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు థ్యాంక్స్ టు రవివర్మ మాస్టర్ అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయాలంటే ఈ టిప్స్ పాటించండి..

Fri Jun 18 , 2021
కరోనా వ్యాక్సినేషన్ ప్రకియ మన దేశంలో దశల వారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్‌పై ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారు ఏం చేయాలో.. ఏం చేయకూడదో.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.