Samantha: దెబ్బకు దిగొచ్చిన అక్కినేని కోడలు.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసింది! ఆ మాటతో డౌట్స్ క్లియర్

Samantha Divorce Issue: సమంత- నాగ చైతన్య వ్యవహారం విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ నడిచింది. అయితే తాజాగా సామ్ చేసిన ఓ పోస్టుతో జనాల్లో ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.

గత వారానికి పైగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూ. ఇప్పటికే ఈ ఇష్యూపై కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. చై- సామ్ నడుమ అభిప్రాయం బేధాలు తలెత్తాయని, వాళ్ళిద్దరి వ్యవహారం విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ నడిచింది. అందుకు తోడు సమంత ఒంటరిగా టూర్స్ వేస్తుండటం, డివోర్స్ ఇష్యూపై ఎక్కడా స్పందించకపోవడం అక్కినేని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కొత్త సందేహాలకు తెరలేపాయి.

ఈ పరిస్థితుల నడుమ సమంత ఏ చిన్న పోస్ట్ పెట్టినా అందరి చూపు దానిపైనే ఉంటోంది. సామ్ పెట్టిన పోస్టులో పరోక్ష అర్థాలు వెతుకుతూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున షేర్ చేసిన ఓ పోస్ట్‌పై సమంత రిప్లై ఇవ్వడం, ఆ వెంటనే తాను పెట్టిన ట్యాగ్ లైన్ ఎడిట్ చేసి మరోలా రాయడం సరికొత్త సందేహాలు లేవనెత్తింది. ఇదంతా చూసి సమంత- నాగ చైతన్య డివోర్స్ అంశంపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్లే అంటున్నారు కొందరు.

''సెప్టెంబర్ 20వ తారీఖు.. నాకు చాలా స్పెషల్ డే.. నా హీరో, నా ప్రేరణ నాన్న గారి (అక్కినేని నాగేశ్వరరావు) పుట్టినరోజు'' అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు నాగార్జున. ఇది చూసిన అక్కినేని కోడలు సమంత దాన్ని రీ ట్వీట్ చేస్తూ 'ఇది చాలా బాగుంది' అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఎప్పుడూ నాగార్జునను మామ అంటూ ముద్దుగా పిలిచే సామ్.. ఈ సారి మాత్రం నాగార్జున అని ఏకవచనంతో సరిపెట్టడంతో నెట్టింట రచ్చ మొదలైంది. సమంతపై కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు.
మహేష్ బాబుపై శ్రీ రెడ్డి నాటీ కామెంట్.. ఏకంగా ఆ మాట అనేస్తూ!! దారుణమైన సెటైర్స్ వేస్తున్న నెటిజన్స్
దీంతో అది గ్రహించిన సమంత.. దెబ్బకు దిగొచ్చి 'ఇది చాలా బాగుంది నాగార్జున మామ' అంటూ తన ట్యాగ్ లైన్ ఎడిట్ చేసేసింది. దీంతో 'మామ' అనే పదంతో విడాకులపై సమంత చిన్న క్లారిటీ ఇచ్చేసిందని చెప్పుకుంటున్నారు జనం. ఏదిఏమైనా సినీ తారలపై ఓ ఇష్యూ బయటకొచ్చిందంటే ప్రతి చిన్న పదం కూడా బూతద్దంలో పెట్టి చూస్తారని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

‘మీ మాటలు ఎంతో కదిలించాయి’.. చిరు, అమీర్‌ల గురించి నాగచైతన్య ట్వీట్

Mon Sep 20 , 2021
నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరి’. ఆదివారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు.