షూ విప్పి మరీ.. సింగర్ చేసిన పనికి అంతా ఫిదా.. విజయ్ ప్రకాశ్‌పై ప్రశంసలు

సింగర్ విజయ్ ప్రకాశ్ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చింతకాయల రవి సినిమాలోని బాగుందే బాగుందే అనే పాటతో తెలుగు శ్రోతలకు దగ్గరయ్యారు విజయ్ ప్రకాశ్. అయితే అత్తారింటికి దారేది చిత్రంలోని ఆరడుగుల బుల్లెట్ సాంగ్‌తో అందరి దృష్టిలో పడ్డారు.

ప్రధానాంశాలు:షూ విప్పి మరీ పాట పాడిన గాయకుడుసింగర్ చేసిన పనికి అంతా ఫిదావిజయ్ ప్రకాష్‌పై ప్రశంసలుసింగర్ విజయ్ ప్రకాశ్ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చింతకాయల రవి సినిమాలోని బాగుందే బాగుందే అనే పాటతో తెలుగు శ్రోతలకు దగ్గరయ్యారు విజయ్ ప్రకాశ్. అయితే అత్తారింటికి దారేది చిత్రంలోని ఆరడుగుల బుల్లెట్ సాంగ్‌తో అందరి దృష్టిలో పడ్డారు. అలాంటి సింగర్ విజయ్ ప్రకాశ్ తాజాగా అలీతో సరదాగా షోలో వచ్చారు. ఆయన సతీమణి మహతితో కలిసి ఈ షోలో ముచ్చటించారు. ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంగతులను వివరించారు. అయితే విజయ్ ప్రకాశ్ పాడిన శివుని పాట అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

నేను దేవుడిని అనే సినిమాలోని ఓం శివోహం అనే పాటను గుక్క తిప్పకుండా విజయ్ ప్రకాశ్ పాడే తీరుకు ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సింది. కాశీలో శివుడిని పూజకు ముందుగా ఈ పాటను పెట్టి మరీ నిత్య క్రతువులు ప్రారంభిస్తారట. అంతలా ఈ పాట శివ భక్తులను ఆకట్టుకుంది. ఈ పాట వెనకాల ఉన్న నేపథ్యాన్ని విజయ్ ప్రకాశ్ చెబుతూ అసలు విషయం బయటపెట్టేశారు.

ఇళయారాజా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అక్కడి వెళ్లే సరికి.. వేరే గొంతుతో పాడిన ఈ పాట వినిపించారు. విన్నాక భయం వేసింది. వెళ్లు పాడు అని ఇళయారాజా అన్నారు. ఈ పాట నేను పాడగలనా? అని భయం వేసింది. అలా ఇళయారాజా గారితో నేను అనే సరికి.. ఆయన భుజం తట్టి.. వెళ్లు.. నువ్ పాడగలవు అని అన్నారు. నా మీద నాకు నమ్మకం లేదు గానీ ఆయనకుంది.. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే పాడేశాను అని అన్నారు.
Ormax Media : మళ్లీ మహేష్ బాబు నంబర్ వన్.. దటీజ్ సూపర్ స్టార్.. ఫ్యాన్స్ హల్చల్
ఇక అలీ కోరిక మేరకు ఆ పాటను షోలో కూడా ఆలపించారు విజయ్ ప్రకాష్. అయితే పాడే ముందు తన షూలను విప్పి పాడటాన్ని వీక్షకులు గమనించారు. అక్కడే విజయ్ ప్రకాశ్ అందరి మనసులు గెల్చుకున్నారు. పాట పాడిన తీరు అంతా ఒకెత్తు అయితే.. పాటను భక్తితో, అలా వినయం షూలు విప్పి పాడటంతో అందరూ ఫిదా అయ్యారు. విజయ్ ప్రకాష్ నిబద్దత, అంకిత భావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Shankar : RAPO19 యూనిట్‌కు శంకర్ సర్ ప్రైజ్.. ఇస్మార్ట్ హీరోతో ఇండియన్ డైరెక్టర్!

Wed Jul 14 , 2021
ఇండియన్ డైరెక్టర్ శంకర్ పేరుకు పరిచయమే అక్కర్లేదు. భారత సినీ పరిశ్రమకు శంకర్ అందించిన చిత్రాలే ఆయన సత్తా ఏంటో చెబుతుంటాయి. దక్షిణాది చిత్రాల సత్తువ ఏంటో చూపించారు. తీసిన ప్రతీ చిత్రంలోనూ సామాజిక కోణాన్ని టచ్ చేయడం ఆయన ప్రత్యేకత.

You May Like