ఆ రోజులను గుర్తు చేసుకున్న ‘ఉరి’ హీరో.. ఎంతో ధన్యవాదాలు అంటూ పోస్ట్

అంతకు ముందుకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ‘ఉరి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు నటుడు విక్కీ కౌశల్. మొదటి నుంచి బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించిన అతను.. తాజాగా తన జీవితంలో ముఖ్యమైన రోజుని గుర్తు చేసుకున్నాడు.

సినిమా అంటే ఇష్టపడే ప్రతీ ఒక్కరు తమకు నటించే అవకాశం వస్తే బాగుంటుంది అని అనుకుంటారు. ఇక సినిమా అంటే పిచ్చి ఉండే వాళ్లు జీవితంలో ఒక్కసారైన వెండితెరపై కనిపిస్తే చాలు అని ఆశపడుతుంటారు. అయితే అదృష్టం బాగున్న కొందరు తమ కోరికను సాకారం చేసుకొని సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటే.. మరికొందరు మాత్రం అదే ఆశతో మిగిలిపోతుంటారు. అయితే నటించే అవకాశం దక్కిన ప్రతీ ఒక్కరిలో ముఖ్యమైన రోజు.. తమ తొలి ఆడిషన్ ఇచ్చిన రోజు.

ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రదర్శన చేయడం ఎంత ముఖ్యమో.. సినిమాలో నటులుగా ఎంపిక కావాలంటే ఆడిషన్‌లో మంచి ప్రతిభ కనబరడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతీ నటీనటులు ఆ ఆడిషన్ ఇచ్చిన రోజుని ఎప్పటికీ మర్చిపోరు. నటుడు విక్కీ కౌశల్ కూడా తన తొలి ఆడిషన్‌ని తాజాగా గుర్తు చేసుకున్నారు. 2012లో జూన్ 11వ తేదీన తాను ఇచ్చిన తొలి ఆడిషన్ పిక్‌ని అతను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. నీరజ్ ఘేవాన్ దర్శకత్వంలో రూపొందిన ‘మసాన్’ అనే చిత్రంతో విక్కీ తొలిసారిగా హీరోగా అరంగేట్రం చేశారు.
విక్కీ కౌశల్ ఆడిషన్
ఆ తర్వాత రాజీ, సంజూ, రామన్ రాఘవ్ 2.0, లస్ట్ స్టోరీస్, మన్మర్జియాన్ తదితర ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఇవేవీ కూడా విక్కీకి ఊహించినంత సక్సెస్‌ను అందించలేదు. కానీ, 2019లో వార్ డ్రామాగా రూపొందిన ‘ఉరి-ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్నారు ఆయన. ఇక తన తొలి ఆడిషన్ పిక్‌ని షేర్ చేసిన విక్కీ ‘తొమ్మిది సంవత్సరాల క్రితం, ధన్యవాదాలు’ అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విక్కీ.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘సర్దార్ ఉదమ్ సింగ్’, ‘తక్త్’, ‘శామ్ బహదూర్’, ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామా’, ’మిస్టర్ లేలే’ తదితర సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జీవితాంతం అలా గడిపేయోచ్చు.. అనుష్క శర్మ ఎమోషనల్

Mon Jul 12 , 2021
విరుష్క (విరాల్ కోహ్లీ అనుష్క శర్మ) జంటకు జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. ఇక ఈ ఇద్దరు కాస్త ముగ్గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.