భారత్ టెకీలకు గుడ్‌న్యూస్.. ట్రంప్ తీసుకొచ్చిన H-1B వీసా రూల్స్‌ను కొట్టేసిన కోర్టు!

Donald Trump అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఐటీ ఉద్యోగులు, హెచ్-1బీ వీసాలు వంటి అంశాలు తరుచూ పతాక శీర్షికల్లో నిలుస్తూ వస్తున్నాయి.

ప్రధానాంశాలు:స్థానికులకు మేలు జరిగేలా వీసాల జారీలో మార్పులు.ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేసిన అమెరికా సంస్థలు.పాత విధానాన్ని అనుసరించాలని కోర్టు తీర్పు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన H-1B వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఉద్యోగులను తీసుకోకుండా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతేడాది వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. లాటరీ పద్ధతిలో ఎక్కువ వేతనాలుండే ఉద్యోగాలకు అమెరికన్లను తీసుకొనేలా నిబంధనలు తీసుకొచ్చారు. అయితే, ఈ నిబంధన వల్ల ప్రతిభావంతులైన విదేశీయులు, విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగా మారుతుందని ఐటీ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

మోదీకి ప్రత్యామ్నాయం మమతానే.. రాహుల్ కాదు.. టీఎంసీ పత్రిక సంచలన కథనం!
ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇమిగ్రేషన్, నేషనాలిటీ యాక్ట్‌కు విరుద్ధమని చాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు పలువురు పిటిషనర్లు వాదించారు. గతేడాది డిసెంబరులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఆ నిబంధనలను తాత్కాలికంగా నిలిపేసింది. తాజాగా ఆ నిబంధనలు చెల్లబోవంటూ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నిబంధనలను ఇచ్చినప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ చార్జి మంత్రిని అక్రమంగా నియమించారని, కాబట్టి ఆ రూల్స్ చెల్లవని తేల్చి చెప్పింది. H-1B వీసాలను నిషేధించే నియమాలు చెల్లుబాటుకావని స్పష్టం చేసింది.

Bengal by Polls బెంగాల్‌లో బీజేపీ మరో షాక్.. టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో
స్థానికులకు ప్రయోజనం కల్పించేలా ట్రంప్ వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. తన వీసా విధానం మరింత పారదర్శకంగా మారుతుందని, ఇక్కడి ఉద్యోగాల కోసం విదేశీయులు, స్థానికులతో పోటీ పడటం కూడా తగ్గుతుందని అప్పట్లో ప్రకటించారు. H-1B వీసాతో అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని వారి కంపెనీల్లో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది యుఎస్ టెక్ కంపెనీలు పెద్దఎత్తున భారత్, చైనాలకు చెందిన ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

మా నిఘా వైఫల్యమే.. కాబూల్ డ్రోన్ దాడిపై ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న అమెరికా
ఏటా జారీ అయ్యే 85వేల హెచ్1 బీ వీసాల్లో చైనా, భారతీయ పౌరులే దాదాపు 50వేల వీసాలు పొందుతుంటారు. ఒకవేళ ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనలు అమలుచేస్తే ఇరు దేశాల టెకీలపై తీవ్ర ప్రభావం పడతుంది. ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ లాంటి రంగాల్లో నిపుణులకు మాత్రమే హెచ్-1బీ వీసాలను అమెరికా మంజూరు చేస్తోంది. అమెరికాలోని కంపెనీలు వర్క్ వీసాలాగా హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటాయి. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లిన వేలాది మంది టెకీలు హెచ్-1బీ వీసాలతోనే ఉద్యోగం చేస్తున్నారు.

మా గ్రామానికి రోడ్డు వేసే వరకూ పెళ్లి చేసుకోను.. సీఎంకి లేఖ రాసిన 26 ఏళ్ల యువతి!
హెచ్-1బీ వీసాలకు తొలుత దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వీటిని లాటరీ ద్వారా జారీచేస్తారు. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గతంలో ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలకాలని భావించారు. హెచ్‌-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది.

Punjab crisis అవమానాల మధ్య కొనసాగలేను.. విసిగిపోయి రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Punjab CM కెప్టెన్ అమరీందర్ రాజీనామా.. భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన!

Sat Sep 18 , 2021
పంజాబ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు.