ఐఏఎస్ అధికారిని కూరగాయల షాపులో కూర్చోబెట్టి.. పిల్లాడ్ని వెతకడానికి వెళ్లిన మహిళ!

ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి తిరిగెళుతున్న ఓ అధికారి.. తోవలో కూరగాయలు కొనుక్కువెళ్దామని ఓ మార్కెట్‌కు వెళ్లాడు. ఓ దుకాణం వద్దకు వెళ్లేసరికి అక్కడి పెద్దావిడ ఆయనను కూర్చోబెట్టి కొడుకు వెదకడానికి వెళ్లింది.

ప్రధానాంశాలు:వైరల్ అవుతున్న ఐఏఎస్ అధికారి ఫోటో.కూరగాయల షాపు వద్ద కూర్చన్న అధికారి.ఫేస్‌బుక్‌లో వైరల్ కావడంతో వివరణ.ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నతాధికారి కూరగాయలు అమ్ముకోవడం ఏంటని నెటిజన్లు షాకయ్యారు. దీనిపై స్పందించిన ఆయన.. కూరగాయలు దుకాణం వద్ద కూర్చున్న ఫోటో నిజమేనని చెప్పారు. అయితే, తాను కూరగాయలు అమ్మలేదని, కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లానని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రవాణా విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అఖిలేశ్‌ మిశ్రా తన ఫోటోపై వివరణ ఇచ్చారు.

‘ఉద్యోగ రీత్యా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వస్తూ మార్కెట్ వెళ్లిన సమయంలో కూరగాయలు అమ్ముకునే ఓ పెద్దావిడ.. తన తన పిల్లాడు కనిపించకపోయే సరికి అతడి కోసం వెతకడానికి వెళ్లింది. పిల్లాడ్ని చూసి వస్తా అని చెప్పి.. తన దుకాణాన్ని చూడమని చెప్పింది.. దీంతో అక్కడే కూర్చున్నాను.. ఈ లోగా కొందరు అక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫేస్‌బుక్‌లో పెట్టారు.. నేను కూడా ఆ ఫోటోను ఈ రోజే చూశాను.. ’’ అని అఖిలేశ్‌ మిశ్రా వివరించారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఉన్నత అధికారి అయి ఉండి కూడా ఎటువంటి దర్పం ప్రదర్శించకుండా ఆమె దుకాణం చూసుకోమని చెప్పగానే సామాన్యుడిలా కూర్చోవడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వినమ్రతపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆయన సంప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Virat Kohliని వెనక్కి పిలిచిన రహానె.. రిప్లైలో ఊహించని ట్విస్ట్

Sat Aug 28 , 2021
లీడ్స్ టెస్టులో విరాట్ కోహ్లీకి లైఫ్ వచ్చినా.. నిమిషాల వ్యవధిలోనే వికెట్ చేజార్చుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్లే బంతిని వెంటాడి స్లిప్‌లో జో రూట్ చేతికి కోహ్లీ చిక్కాడు.