కేంద్రం తీపికబురు.. ఏపీకి రూ.1,543కోట్లు, తెలంగాణకు రూ.2,155కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,543 కోట్లు, తెలంగాణకు రూ.2,155 కోట్లు విడుదల చేసింది.

ప్రధానాంశాలు:తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రంఏపీకి రూ.1,543 కోట్లు, తెలంగాణకు రూ.2,155 కోట్లు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జీఎస్‌టీ పరిహారం కింద కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,543 కోట్లు, తెలంగాణకు రూ.2,155 కోట్లు విడుదల చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.75వేల కోట్లు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే రూ.1.50 లక్షల కోట్ల లోటును రిజర్వుబ్యాంకు నుంచి తీసుకొనే రుణం ద్వారా చెల్లించడానికి మే 28న జరిగిన 43వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం అంగీకరించింది.

2020-21లో ఇదే విధానంలో రాష్ట్రాలకు కేంద్రం రూ.1.10 లక్షల కోట్లు అందించింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు చెల్లించనుంది. సెస్‌ వసూళ్ల ఆధారంగా చెల్లించే రూ.లక్ష కోట్ల పరిహారం కూడా కలిపితే ఈ ఏడాది రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లు అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రస్తుతం రూ.75వేల కోట్ల విడుదలతో ఈ ఏడాది ఒక్క విడతలోనే 50% పరిహారం చెల్లించినట్లయిందని వెల్లడించింది.

ఈ మొత్తాన్ని కేంద్రం 5 ఏళ్ల సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ.68,500 కోట్లు, 2 ఏళ్ల సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ.6,500 కోట్లు సేకరించింది. 5 ఏళ్లకు 5.60%, రెండేళ్లకు 4.25% మేర వార్షిక వడ్డీ వర్తిస్తుందని ఆర్థికశాఖ తెలిపింది. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో వైద్య ఆరోగ్య మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి వీలవుతుందని ఆర్థికశాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

హైదరాబాద్: నెల రోజుల వాన ఒక్క రోజులోనే.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Fri Jul 16 , 2021
ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టు హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.