జాబ్ క్యాలెండర్‌ పేరుతో మోసం.. సీఎం జగన్‌పై నిరుద్యోగి ఫిర్యాదు, సీన్‌లోకి రాష్ట్రపతి

జాబ్ క్యాలెండర్‌తో తమను మోసం చేశారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కర్నూలుకు చెందిన ఓ నిరుద్యోగి స్పందన్ కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.

ప్రధానాంశాలు:జాబ్‌ క్యాలెండర్‌తో మోసం చేశారని నిరుద్యోగి ఆరోపణహోంమంత్రిపైనా కేసు నమోదుకు డిమాండ్రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరికఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసి జాబ్ క్యాలెండర్‌పై చాలామంది నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా అరాకొర పోస్టులకు ప్రకటన చేయడమేమిటని మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిరుద్యోగ యువతి రాస్తారోకో చేపట్టి తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ నిరుద్యోగి ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోంమంత్రి సుచరితపై స్పందన కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

2019లో 6,500 పోలీసు పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారని, 2020లో 6,300 పోస్టులు భర్తీ చేస్తామని హోం మంత్రి సుచరిత ప్రకటించారని, తీరా జాబ్‌ క్యాలెండర్‌లో 450 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించి తీవ్ర నిరాశకు గురిచేశారని కర్నూలు జిల్లాకు చెందిన ఆ నిరుద్యోగి శనివారం కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం, హోంమంత్రిపై కేసు నమోదు చేయాలని, వారిని కర్నూలు కలెక్టరేట్‌కు పిలిపించాలని ఫిర్యాదులో కోరాడు.

అయితే ముఖ్యమంత్రి, హోంమంత్రిపై కేసు నమోదు చేసే అవకాశం లేదని కాల్‌సెంటర్‌ నిర్వాహకులు సమాధానమిచ్చారు. అన్యాయం జరిగితే ఎలాంటి వారిపైనైనా స్పందనలో ఫిర్యాదు చేయవచ్చని సీఎం జగన్‌ స్వయంగా చెప్పారని, అలాంటిది ఆయనపై ఎందుకు కేసు ఎందుకు నమోదు చేయరని ఆ నిరుద్యోగి నిలదీశాడు. తన ఫిర్యాదు తీసుకోకపోతే ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Kashimr Encounter లష్కరే టాప్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతం

Mon Jun 21 , 2021
Jammu And Kashmir కశ్మీర్‌లో మారణహోమానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేసింది.