విరాట్ కోహ్లీ నిర్ణయం ఎలా లీకైంది..? కవర్ చేసిన బీసీసీఐ పెద్దలు

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగబోతున్నట్లు మూడు రోజుల క్రితమే ఎలా లీకైంది. ఆ వార్త నిజమైనా.. బీసీసీఐ పెద్దలు ఎందుకు కవర్ చేస్తూ మాట్లాడారు.

ప్రధానాంశాలు:టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీమూడు రోజుల క్రితమే సమాచారం లీక్ఆ వార్తల్ని ఖండించిన బీసీసీఐ పెద్దలుఈరోజు అధికారికంగా ప్రకటించిన కోహ్లీ భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగబోతున్నట్లు మూడు రోజుల క్రితమే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని..టీ20 టీమ్ కెప్టెన్‌గా అతనికి టీ20 వరల్డ్‌కప్ ఆఖరి అని ఊహాగానాలు వినిపించాయి. కానీ.. బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్.. ఆ వార్తలు, ఊహాగానాల్ని కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమైనవని చెప్తూనే.. మూడు ఫార్మాట్లకీ విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశారు.

కానీ.. గురువారం సాయంత్రం అనూహ్యంగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లీ.. టీ20 కెప్టెన్‌గా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తనకి ఆఖరిదని ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాకి ఈ విషయం తెలియజేసినట్లు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే.. మూడు రోజుల క్రితమే కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలగబోతున్న విషయం ఎలా లీకైంది..? అనే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2017 వన్డే, టీ20 టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అయితే.. బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతుండటంతో పనిభారం పెరిగిందని చెప్పుకొచ్చిన కోహ్లీ.. ఇకపై టీ20ల్లో కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Virat Kohli Trolls: పండగ చేసుకుంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. నవ్వులే నవ్వులు

Thu Sep 16 , 2021
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించగానే.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో సరదా మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. గత రెండేళ్లుగా కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా..