ఈడీ నోటీసులపై.. ఎంపీ నామా ఆసక్తికర వ్యాఖ్యలు

40 ఏళ్ల క్రితమే మధుకాన్ సంస్థను స్థాపించామన్నారు. ప్రస్తుతం ఆయన ఏ కంపెనీలో కూడా డైరెక్టర్‌గా లేరన్నారు. అయినా కూడా ఈడీ తనకు నోటీసులు పంపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు నామా.

ప్రధానాంశాలు:ఎన్ని సమస్యలు వచ్చిన కేసీఆర్ వెంటేతన బలం కేసీఆర్, ఖమ్మం ప్రజలే ఈడీ విచారణకు సహకరిస్తా: ఎంపీ నామా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈడీ నోటీసులపై తొలిసారిగా స్పందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా టీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు నామా. తన బలం కేసీఆర్, ఖమ్మం ప్రజలే అన్నారు ఎంపీ. గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నానన్న నామా తమ కంపెనీలు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టయన్నారు. ఏ కంపెనీలో తాను డైరెక్టర్‌గా లేనన్నారు ఎంపీ నామా నాగేశ్వర్‌రావు. 40 ఏళ్ల క్రితమే మధుకాన్‌ను స్థాపించానని తెలిపారు.

రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ఎస్పీవీ కంపెనీ BOT పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టిందన్నారు. నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చిందన్నారు. కానీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. ఎస్క్రో అకౌంట్ పై బ్యాంకర్ కే పూర్తి పవర్ ఉందని.. విచారణకుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునల్ లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. తాను డైరెక్టర్‌గా లేకపోయినా ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించడానికి అసలు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్‌ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేయనున్న రియల్‌మీ.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Sat Jun 19 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ జూన్ 24వ తేదీన లాంచ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో రియల్‌మీ బడ్స్ క్యూ2 ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ కానున్నాయి. ఇందులో ఎన్నో అదిరిపోయే ఫీచర్లను రియల్‌మీ అందించింది.