బీజేపీ, కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్.. వచ్చే నెలలో భారీ సభకు సన్నాహాలు

కాంగ్రెస్​, బీజేపీ నిర్వహించిన రెండు సభలపై టీఆర్​ఎస్​ పెద్దలు విశ్లేషణలో పడ్డారు. అక్కడ నిర్మల్​ సభ, ఇక్కడ గజ్వేల్​ సభకు జనాల తరలింపు, ఎక్కడి నుంచి భారీగా తరలివచ్చారనే వివరాలను సేకరిస్తున్నారు

ప్రధానాంశాలు:కాంగ్రెస్, బీజేపీ సభలో ఉలిక్కిపడిన టీఆర్ఎస్కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్న నేతలువచ్చే నెలలో భారీ సభకు సన్నాహాలు
తెలంగాణలో సభలు, పాదయాత్రలతో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. శుక్రవారం గజ్వేల్‌లో కాంగ్రెస్, నిర్మల్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించాయి. మొన్నటి వరకు ప్రతిపక్షాల విమర్శలను లైట్ తీసుకున్న కేసీఆర్‌ తాజాగా పరిణామాలతో సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌస్‌కు కూతవేటు దూరంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో గులాబీ బాస్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. దానికి కౌంటర్‌గా వచ్చే నెలలో గజ్వేల్‌లో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

వాస్తవానికి గతంలోనే టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ ప్లీనరీని నిర్వహించేందుకు ఇప్పుడు సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు భారీ సభలను నిర్వహించడం, మధ్యలో షర్మిల ఆరోపణలు, తీన్మార్ మల్లన్న వ్యవహారం.. ఇలాంటి పరిణామాల మధ్య అన్నింటికీ చెక్ పెట్టేలా ప్లీనరీ పేరుతో భారీ సభను నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నిర్వహించిన రెండు సభలపై టీఆర్ఎస్ పెద్దలు విశ్లేషణ చేస్తున్నారు. నిర్మల్, గజ్వేల్ సభలకు ఎక్కడి నుంచి ప్రజలను తరలించారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. వీటిపై వారం రోజుల్లో కేసీఆర్‌కు నివేదికలు సమర్పించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సినీ రంగంపై సర్కారు వివక్ష చూపుతోంది.. ‘మహా’ ప్రభుత్వంపై కంగనా సంచలన కామెంట్స్

Sun Sep 19 , 2021
నటి కంగనా రనౌత్ చేసే కామెంట్స్ చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. ఆమె సినిమాలతో ఎంత పాపులర్ అయ్యారో కాంట్రవర్సీలతో కూడా అంతే పాపులారిటీ తెచ్చుకున్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా.