హుజూరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్.. ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన రేవంత్

రేవంత్ దూకుడు పెంచారు. త్వరలో రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గానికి ఇన్ ఛార్జలను నియమించారు. ఈ మేరకు వారి పేర్లను ప్రకటించారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు సిద్ధమైంది. ఉప ఎన్నిక కోసం పార్టీ ఇన్‌చార్జ్‌లను టీపీసీసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది.

వీణవంక మండల ఇన్‌చార్జ్‌లుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండల ఇన్‌చార్జ్‌లుగా విజయరమణారావు, రాజ్ ఠాగూర్, జమ్మికుంట టౌన్ ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎంపీ రాజయ్య, ఈర్ల కొమురయ్య, హుజురాబాద్ మండల ఇన్‌చార్జ్‌లుగా టి.నర్సారెడ్డి, లక్ష్మణ్‌ కుమార్, హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జ్‌లుగా బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంట మండల ఇన్‌చార్జ్‌లుగా నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ మండల ఇన్‌చార్జ్‌లుగా కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యను నియమించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీలను పార్టీ నియమించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టిన టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వివో ఎస్10 సిరీస్ ఫీచర్లు లీక్.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో!

Wed Jul 14 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఎస్10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.