పారాలింపిక్స్‌లో భవీనా పటేల్‌కి రజతం.. సరికొత్త చరిత్ర

పారాలింపిక్స్‌లో పసిడి గెలిచేలా కనిపించిన టీటీ ప్లేయర్ భవీనా పటేల్.. ఊహించని విధంగా ఫైనల్లో ఓడిపోయింది. వరుస గేమ్‌లలో ఓడిన భవీనా రజతంతో సరిపెట్టింది.

ప్రధానాంశాలు:పారాలింపిక్స్‌లో భారత్‌కి ఫస్ట్ మెడల్ఫైనల్లో ఓడిన భవీనా పటేల్‌కి రజత పతకంటేబుల్ టెన్నిస్‌లో భారత్‌కి ఇదే తొలి పతకంవరల్డ్ నెం. 1 చేతిలో ఓడిన భవీనాపారాలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కి చేరి పసిడి ఆశలు రేపిన భవీనా పటేల్.. ఆదివారం ఫైనల్లో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టింది. చైనాకి చెందిన యింగ్ జావోతో ఈరోజు జరిగిన క్లాస్-4 మహిళల సింగిల్స్ ఫైనల్లో భవీనా పటేల్ 0-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. యింగ్ జావోకి ఫైనల్లో 34 ఏళ్ల భవీనా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే తొలిసారి.

భారీ అంచనాల నడుమ ఈరోజు ఫైనల్లో ఆడిన భవీనా పటేల్.. 7-11, 5-11, 6-11 తేడాతో వరుస గేమ్‌లలో ఓడిపోయింది. చైనాకి చెందిన మియావో జంగ్‌పై శనివారం సెమీస్‌లో పోరాడి గెలిచిన భవీనా పటేల్.. అంతక ముందు ఫ్రీక్వార్టర్స్‌లో బ్రెజిల్‌కి చెందిన ఒలివెరా‌, క్వార్టర్స్‌లో సెర్బియాకి చెందిన రాంకోవిచ్‌లను ఓడించింది. ఒలివెరా 9వ ర్యాంక్‌లో ఉండగా.. రాంకోవిచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కావడం గమనార్హం. అయినప్పటికీ.. ఇద్దరిపైనా పోరాడి గెలిచిన భవీనా పటేల్.. ఫైనల్లో మాత్రం నెం.1 ర్యాంకర్ యింగ్ జాగోపై నిరాశపరిచింది.

గుజరాత్‌కి చెందిన భవీనా పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. మొదట్లో ఫిట్‌‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం స్టార్ట్ చేసిన భవీనా పటేల్.. ఆ తర్వాత ఈ గేమ్‌ని కెరీర్‌గా ఎంచుకుని కష్టపడింది. ఒత్తిడిని జయించడం.. మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్న భవీనా పటేల్.. ఫైనల్లో మాత్రం పుంజుకోలేకపోయింది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో మహిళా అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రైతుల తలలు పగలడం నేను చూడాలి.. పోలీసులకు కలెక్టర్ ఆదేశం.. వీడియో వైరల్

Sun Aug 29 , 2021
Farm Laws సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తర భారతంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు.