ముగిసిన పారాలింపిక్స్.. భారత్‌ ఎన్ని పతకాలు గెలిచిందంటే..?

పారాలింపిక్స్ ఆదివారంతో ముగిశాయి. అంచనాలకి మించి రాణించిన భారత అథ్లెట్లు ఏకంగా 19 పతకాలు గెలుపొందగా.. ఇందులో ఐదు గోల్డ్ మెడల్స్ ఉండటం విశేషం. భారత పతాకధారిగా అవని లేఖరా వ్యవహరించింది.

ప్రధానాంశాలు:ముగిసిన పారాలింపిక్స్భారత పతాకధారిగా అవని లేఖరా19 పతకాలు గెలిచిన భారత్పతకాల పట్టికలో భారత్‌కి 24వ స్థానం టోక్యో వేదికగా జరిగిన పారాలింపిక్స్ ఆదివారం ముగిశాయి. ఒలింపిక్స్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో షూటర్ అవని లేఖరా భారత పతాకధారిగా వ్యవహరించి.. భారత్ బృందాన్ని నడిపించింది. ఆగస్టు 24 నుంచి జరిగిన పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత అథ్లెట్లు ఏకంగా 19 పతకాలు గెలుపొందారు. ఇందులో ఐదు పసిడి పతకాలు ఉండగా.. ఎనిమిది రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌గా పతకాల పట్టికలో భారత్ 24వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో భారత్‌కి ఒకే ఒక పతకం దక్కగా.. 2016 రియో పారాలింపిక్స్‌లో ఆ సంఖ్య 4కి చేరింది. కానీ.. తాజాగా ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో ఏకంగా 19 పతకాలు దక్కడం విశేషం.

టోక్యో పారాలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచిన భారత క్రీడాకారులు: అవని లేఖరా (షూటింగ్), సుమిత్ అన్టిల్ (జావెలిన్ త్రో), మనీశ్ నర్వాల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగర్‌ (బ్యాడ్మింటన్)

రజత పతకాలు: భవనీ పటేల్ (టేబుల్ టెన్నిస్), నిషాద్ కుమార్ (హై జంప్), యోగేష్ (డిస్కస్ త్రో), దేవేంద్ర ఝజారియా (జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (హై జంప్), సింఘరాజ్ (షూటింగ్), ప్రవీణ్ కుమార్ (హై జంప్), సుహాస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్)

కాంస్య పతకాలు: సుందర్ సింగ్ (జావెలిన్ త్రో), సింఘరాజ్ (షూటింగ్), శరద్ కుమార్ (హై జంప్), అవని లేఖరా (షూటింగ్), హరీందర్ సింగ్ (ఆర్చరీ), మనోజ్ సర్కార్ (బ్యాడ్మింటన్)

ఆగస్టు 24న జరిగిన ఆరంభోత్సవ వేడుకల్లో భారత పతాకధారిగా షాట్‌ ఫుట్ ఆటగాడు టేక్ చంద్ వ్యవహరించాడు. వాస్తవానికి ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా మరియప్పన్ తంగవేలుని ఎంపిక చేశారు. కానీ.. తమిళనాడుకి చెందిన ఈ హైజంప్ క్రీడాకారుడు.. ఆఖర్లో ఊహించని విధంగా ఆరంభోత్సవానికి దూరమయ్యాడు. తంగవేలు టోక్యోకి వెళ్లే సమయంలో విమానంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తంగవేలుని క్వారంటైన్‌లో ఉంచారు. దాంతో.. టేక్ చంద్‌కి పతాకధారిగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ సమాధానాలు చెప్తే చాలు.. రూ.10 వేలు గెలిచేయచ్చు!

Mon Sep 6 , 2021
అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 6వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.10 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.