మోదీకి ప్రత్యామ్నాయం మమతానే.. రాహుల్ కాదు.. టీఎంసీ పత్రిక సంచలన కథనం!

మోదీ నాయకత్వంలోని శక్తివంతమైన బీజేపీని దీటుగా ఎదుర్కొనే నేత ఎవరనేదీ.. కళ్లలో ఒత్తులు వేసుకుని వెదికినా దొరకడం లేదు. అయితే, బెంగాల్ ఎన్నికల్లో విజయంతో మమతా బెనర్జీ పేరు మార్మోగుతోంది.

ప్రధానాంశాలు:టీఎంసీ అధికారిక పత్రికలో వివాదాస్పద కథనం.మోదీ వ్యతిరేకంగా ఏకతాటిపైకి ప్రతిపక్షాలు.రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం కాదని వ్యాఖ్యలు.ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలకు టీఎంసీ వ్యాఖ్యలు ఆదిలోనే గండికొట్టేలా ఉన్నాయి. మోదీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాదని, తమ అధినేత్రి మమతా బెనర్జీ అని టీఎంసీ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేత ఎవరనేది అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుందని టీఎంసీ వాదనలను అంతగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

టీఎంసీ అధికారిక పత్రిక ‘జాగో బంగ్లా’లో ‘మోదీకి ప్రత్యామ్నాయ నేతగా మమత నిలిచారు.. రాహుల్ గాంధీ విఫలమయ్యారు’ అంటూ ఓ కథనాన్ని ప్రచురించడం వివాదానికి దారితీసింది. ‘‘దేశం ప్రత్యామ్నాయ కోసం ఎదురుచూస్తోంది.. రాహుల్ గాంధీ నాకు చాలా కాలంగా తెలుసు, కానీ ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదగడంలో విఫలమయ్యారని నేను చెప్పాలి.. కానీ, మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో మమతా బెనర్జీ విజయం సాధించారు’ అని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ కథనం ప్రచురించారు.

కాగా,దేశం మొత్తం మమతా బెనర్జీకి మద్దతు ఇస్తోందని ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో బందోపాధ్యాయ్ వ్యాఖ్యానించారు. ఈ కథనంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ను అగౌరవపరచడం లేదా ఆ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా గురించి మాట్లాడలేదని అన్నారు.

‘కాంగ్రెస్ లేకుండా ఎటువంటి ప్రత్యామ్నాయ కూటమి గురించి సుదీప్ బందోపాధ్యాయ్ మాట్లాడలేదు.. మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్ గాంధీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కేవలం తన అనుభవాలను ఆయన వెల్లడించారు’ అని అన్నారు. ‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ తన సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోయారు.. కానీ, 2021 అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయ నేతగా మమతా బెనర్జీ విజయవంతమయ్యారు’ టీఎంసీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. వీటిపై మాట్లాడం తొందరపాటు అవుతుందన్నారు. ‘ఎవరు విజయవంతమయ్యారో అనే అంశంపై చర్చ అనవసరం.. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి దీటైన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఉమ్మడి అభ్యర్థి ఎవరినేది ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయిస్తాయన్నారు. భారత రాజకీయ చరిత్రలను పరిశీలిస్తే కూటమిని ఏర్పాటుచేసి వాటిని ఎవరు నడిపిస్తారనేది ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భారత్ టెకీలకు గుడ్‌న్యూస్.. ట్రంప్ తీసుకొచ్చిన H-1B వీసా రూల్స్‌ను కొట్టేసిన కోర్టు!

Sat Sep 18 , 2021
Donald Trump అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఐటీ ఉద్యోగులు, హెచ్-1బీ వీసాలు వంటి అంశాలు తరుచూ పతాక శీర్షికల్లో నిలుస్తూ వస్తున్నాయి.