తల్లి అయిన వివాదాస్పద ఎంపీ నుస్రత్.. మాజీ భర్త కామెంట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

టీఎంసీ ఎంపీ, అందాల తార నుస్రత్ జహాన్ తన జీవితంలో మరో ముందడుగు ముందుకు వేసింది. కొద్ది రోజుల క్రితం తన భర్తకి దూరం అయిన ఆమె.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు వెల్లడించారు.

టీఎంసీ ఎంపీ, అందాల తార నుస్రత్ జహాన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు. బెంగాలీ ముస్లిం అయిన సుస్రత్.. రెండు సంవత్సరాల క్రితం హిందు సాంప్రదాయం ప్రకారం.. 2018లో నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తతో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆమె.. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక లోక్‌సభకి నుదుటిన బొట్టు పెట్టుని వెళ్లిడంపై కూడా ఆమెపై వ్యతిరేకత ఎదురైంది. రీసెంట్‌గా ఆమె తన భర్తతో దూరం అయింది. వ్యక్తిగతంగా విబేధాలు రావడంతో వీరిద్దరు గత ఏడాది నవంబర్ నుంచి దూరంగా ఉంటున్నారు.

అయితే తాజాగా నుస్రత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బుధవారం రాత్రి ఆమె కోల్‌కతాలోని భగీరథీ నియోతియాలో చేరారు. గురువారం ఆమెకు సిజేరియన్ జరిగినట్లు, తల్లీ, బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారని.. ఆమె స్నేహితుడు యష్ దాస్ గుప్తా ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమెకు అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. నుస్రత్ చిరకాల స్నేహితురాలు మిమీ చక్రవర్తి ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

ఇక విబేధాల కారణంగా నుస్రత్‌తో విడిపోయిన ఆమె మాజీ భర్త నిఖిల్ జైన్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. ఎలాంటి తప్పుడు కామెంట్ చేయకుండా.. ‘తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉండాలి. శుభాకాంక్షలు చెప్పడంటో మా ఇద్దరి మధ్య ఉండే విబేధాలు అడ్డురావు.’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక నుస్రత్ రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె బషరట్ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేశారు. తన ప్రత్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి సత్యన్ బసుపై ఘన విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గూగుల్ పే కస్టమర్లకు శుభవార్త.. ఇక ఇంట్లో నుంచే..

Thu Aug 26 , 2021
మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకు కొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎఫ్‌డీ సేవలు పొందొచ్చు. మీరు ఇంట్లో నుంచే బ్యాంక్‌లో అకౌంట్ లేకపోయినా కూడా ఎఫ్‌డీ తెరిచే ఛాన్స్ ఉండనుంది.