11 రోజుల్లోనే డబ్బు రెట్టింపు.. రూ.లక్షకు రూ.2 లక్షలు!

మీకు వొడాఫోన్ ఐడియా గురించి తెలుసా? ఈ కంపెనీ రుణ భారంతో సతమతమౌతోంది. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం అదిరే రాబడిని అందించింది. కేవలం 11 రోజుల్లోనే డబ్బులు రెట్టింపు చేసింది.

ప్రధానాంశాలు:అదిరే లాభంరుణ భారంతో సతమతమౌతున్న కంపెనీకానీ ఇన్వెస్టర్లకు రాబడికేవలం 11 రోజుల్లో డబ్బులు రెట్టింపు అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఇలాంటివి కేవలం స్టాక్ మార్కెట్‌లోనే జరుగుతూ ఉంటాయి. ఈక్విటీ మార్కెట్‌లో కళ్లుచెదిరే లాభంతో పాటు భారీ రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి.

వొడాఫోన్ ఐడియా కంపెనీ గురించి మనకు తెలుసు. రుణ భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి కంపెనీ ఇన్వెస్టర్లకు భారీ లాభాన్ని అర్జించి పెట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఈ షేరు ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. 100 శాతం రాబడిని అందించింది.

Also Read: Mobile Phone వినియోగదారులకు కేంద్రం శుభవార్త.. కొత్త రూల్స్.. ఇకపై..

వొడాఫోన్ ఐడియా కంపెనీ షేర్లు పెరుగుతూనే వస్తున్నాయి. మోదీ సర్కార్ టెలికం రంగానికి రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో వొడాఫోన్ షేర్లు పరుగులు పెట్టాయి. సెప్టెంబర్ 1న ఈ షేరు ధర కేవలం రూ.6 వద్ద ఉండేది.

కానీ ఇప్పుడు వొడాపోన్ ఐడియా షేరు రూ.12కు పైగా చేరింది. అంటే సెప్టెంబర్ 1న ఈ షేరులో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.2 లక్షలు వచ్చేవి. 11 రోజుల్లోనే ఈ స్థాయి లాభం అంటే మామూలు విషయం కాదు. కాగా ఈ కంపెనీ రూ.1.8 లక్షల కోట్లు రుణ భారంతో సతమతమౌతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మా నిఘా వైఫల్యమే.. కాబూల్ డ్రోన్ దాడిపై ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న అమెరికా

Sat Sep 18 , 2021
కాబూల్ విమానాశ్రయంపై ఆగస్టు 26న ఆత్మాహుతి దాడి జరగడంతో.. మూడు రోజుల తర్వాత మరోసారి దాడికి కుట్ర జరిగినట్టు భావించిన అమెరికా డ్రోన్ దాడి చేసింది.