రూ.లక్ష పెడితే.. ఏడాదిలోనే చేతికి రూ.8 లక్షలు.. కళ్లుచెదిరే రాబడి!

ఒక్క సంవత్సరంలోనే రూ.లక్షకు రూ.8 లక్షలు వచ్చాయంటే.. అది చిన్న విషయం కాదు. వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఇలాంటివి స్టాక్ మార్కెట్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి.

ప్రధానాంశాలు:అదిరే లాభంఏడాదిలోనే భారీ రాబడిపరుగులు పెట్టిన షేరు‘కొనడం.. అమ్మడం ద్వారా భారీగా డబ్బు సంపాదించలేం. వేచి ఉండటం వల్ల భారీ లాభం పొందొచ్చు’ అని అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్, బిజినెస్‌మెన్ చార్లీ ముంగెర్ ఒక మాట చెప్పారు. ఇండియన్ ఐటీ స్టాక్ సుబెక్స్ ఈ మాటను నిజం చేస్తోంది.

ఎలా అనుకుంటున్నారా? సుబెక్స్ షేరు ఏడాదిలోనే ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది. ఈ షేర్లను కలిగిన ఇన్వెస్టర్లు ఈరోజు లక్షాధికారులు అయ్యారు. మీరు కూడా తక్కువ డబ్బుతో భారీ లాభం పొందాలని భావిస్తే.. స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ భారీ రిస్క్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

Also Read: పోస్టాఫీస్ అదిరే స్కీమ్.. భార్యాభర్తలకు రూ.60 వేలు!

బెంగళూరు కేంద్రంగా సుబెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ షేరు ధర 2020 జూలై 9న రూ.7.82 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు ఈ షేరు ధర రూ.72కు ఎగసింది. అంటే ఈ షేరు ధర ఏడాదిలోనే 837 శాతం పైకి కదిలిందని చెప్పుకోవచ్చు.

2021 మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ షేరు ఆరు నెలల కాలంలో 150 శాతం రాబడిని అందించింది. నెల రోజుల్లో అయితే 22.8 శాతం పరుగులు పెట్టింది. అంటే ఏడాది కిందట ఈ షేర్లలో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు మీ డబ్బు విలువ రూ.8.37 లక్షలు అయ్యి ఉండేది. అంటే కళ్లుచెదిరే లాభం అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గోవా బీచ్‌లో యంగ్ హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ.. ఒంటిపై నూలుపోగు లేకుండా రౌడీ స్టార్ చిల్!!

Tue Jul 13 , 2021
హీరోయిన్స్‌తో చాలా స్నేహంగా మెదులుతుంటారు విజయ్ దేవరకొండ. పార్టీలు, పబ్స్ అంటూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా కియారా అద్వానీతో ఆయన దిగిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.