ఉద్యోగులకు భారీ బోనస్, బీఎండబ్ల్యూ బైక్స్.. కంపెనీ బంపరాఫర్!

కంపెనీలు వారి బెస్ట్ టాలెంట్‌ బయటకు వెళ్లకుండా చూసుకునేందుకు అదిరే ఆఫర్లు అందిస్తున్నాయి. ఒక కంపెనీ అయితే వారి ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. బైక్స్ కూడా ఆఫర్ చేస్తోంది.

ప్రధానాంశాలు:ఉద్యోగులకు భారీ బోనస్టాప్ పర్ఫార్మర్లకు ఇతర బెనిఫిట్స్కంపెనీ బంపరాఫర్లుపలు కంపెనీలు బాగా పనిచేసే ఉద్యోగులను కోల్పోకుండా ఉండటానికి పలు రకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. టాప్ పర్ఫార్మర్లకు భారీ బోనస్ అందిస్తున్నాయి. అంతేకాకుండా లగ్జరీ కార్లు, బైక్స్‌ కూడా ఆఫర్ చేస్తున్నాయి. బెస్ట్ టాలెంట్‌ను కోల్పోకుండా అంటిపెట్టుకోవడానికి ఇలా చేస్తున్నాయి.

బిజ్2క్రెడిట్ అనే కంపెనీ ఇటీవల 2020-21 అప్రైజల్ ఇయర్‌కు సంబంధించి బోనస్ ప్రకటించింది. అంతేకాకుండా బీఎండబ్ల్యూ బైక్స్ కూడా అందిస్తున్నట్లు తెలిపింది. క్యాష్ రివార్డులు ఆఫర్ చేసింది. టాప్ పర్ఫార్మర్లు వారి పనితీరు లింక్డ్ ప్రోత్సాహకానికి 40 రెట్లు వరకు పొందుతారని తెలిపింది.

Also Read: రూ.లక్ష పెడితే రూ.కోటి.. ఈ షేరుతో కళ్లుచెదిరే లాభం!

అంతేకాకుండా ఈ కంపెనీ దీపావళి గిఫ్ట్‌లను కూడా ముందుగానే ప్రకటించింది. టాప్ పర్ఫార్మర్లకు యాపిల్ ఐవాచ్ బండిల్, సైక్లింగ్ హెల్త్ ప్యాకేజ్, గోల్డ్ కాయిన్స్ వంటి తదితర ఆఫర్లు ప్రకటించింది. ఉద్యోగి అంకితభావం, కృషి, విజయాలు గుర్తించడానికి వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి వెనుకాడబోమని బిజ్2క్రెడిట్ ఇండియా సీటీవో వినీత్ త్యాగి తెలిపారు.

కేవలం ఇది మాత్రమే కాకుండా కోవిడ్ 19 సమయంలో కూడా పలు రకాల ప్రోత్సాహకాలు అందించామని పేర్కొన్నారు. మధ్యంతర క్యాష్ బోనస్, అప్‌గ్రేడెడ్ మెడికల్ బెనిఫిట్ ప్లాన్, వీకెండ్ వర్కింగ్ ఇన్సెన్‌టివ్, బ్రాడ్‌బాండ్ అండ్ టెలిఫోన్ బిల్ రీయింబర్స్‌మెంట్, కోవిడ్ వ్యాక్సినేషన్ కాస్ట్ రీయింబర్స్‌మెంట్ వంటి పలు రకాల ప్రోత్సహకాలు అందించామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కొత్తగా కారు కొనే వారికి కేంద్రం శుభవార్త? దీపావళికి ముందే..

Thu Aug 26 , 2021
కేంద్ర ప్రభుత్వం కార్లపై పన్ను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలునుంది. ధరలు దిగిరానున్నాయి.