ఈ రెండు తింటే ఎక్కువరోజులు బతుకుతారట..

కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యాన్నిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెబుతారు. మరికొన్ని తినడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటంటే..

ప్రధానాంశాలు:చాక్లెట్స్ తినడం వల్ల ఎన్నో లాభాలుగ్రీన్ టీ, చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుందంటున్న నిపుణులుజీవిత కాలాన్ని పెంపొందించుకోవడానికి చాక్లెట్లు బాగా ఉపయోగపడతాయి అని తెలుస్తోంది. తాజాగా చేసిన స్టడీ ప్రకారం జీవిత కాలాన్ని పెంపొందించుకోవడానికి చాక్లెట్స్ ఎంతగానో ఉపయోగ పడతాయని రీసెర్చర్లు అంటున్నారు. అదే విధంగా గ్రీన్ టీ కూడా బాగా ఉపయోగ పడుతుందని తెలుస్తోంది. గ్రీన్ టీ తాగడం మరియు కోకో ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని స్టడీ ద్వారా తెలుస్తోంది.
పీరియడ్స్ టైమ్‌లో నొప్పి వస్తే మంచిదా..
సర్కోపెనీయా అనేది మజిల్ మాస్ తగ్గడం వల్ల వస్తుంది. 5 నుండి 13 శాతం పెద్ద వాళ్ళలో ఈ సమస్య ఉంటుంది. 80 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో 11 నుండి 50 శాతం ఇది ఉంటుంది అయితే పెద్ద వాళ్లలో ఫిజికల్ పర్ఫామెన్స్ తగ్గి పోవడానికి ముఖ్యమైన కారణం ఇదే అని రీసెర్చర్లు అంటున్నారు.
రోజుకి ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువ తింటే మంచిది కాదట జాగ్రత్త..
ఈ సర్కోపెనీయా వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ల మీద పడుతుందని.. జీవితం యొక్క నాణ్యత పెద్ద వాళ్లలో తగ్గుతుందని అనారోగ్య సమస్యలకి దారి తీస్తుందని చెబుతున్నారు. అయితే జర్నల్ ఏజింగ్ లో పబ్లిష్ అయిన దాన్నిబట్టి చూసుకున్నట్లయితే గ్రీన్ టీ లేదా కోకో లో వుండే ఫ్లవనోయిడ్స్ వల్ల ఇబ్బందులు తగ్గుతాయని మనిషి యొక్క జీవిత కాలం పెంపొందించుకోవచ్చు అని అంటున్నారు. అయితే దీనిని డైట్ లో తీసుకోవడం వల్ల ఎలా ఉపయోగపడతాయి అనే విషయం లోకి వస్తే… ఫ్లెవనాయిడ్స్ ని డైట్ లో తీసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది దీని వల్ల వయస్సు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా జీవిత కాలాన్ని కూడా పెంపొందించుకో వచ్చు అని తెలుస్తోంది.
చీరకట్టుకున్నప్పుడు నాజూగ్గా కనిపించాలంటే ఇలా చేయండి..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AP MPTC ZPTC Election Results 2021: ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ హవా

Sun Sep 19 , 2021
AP ZPTC MPTC Election 2021 Counting: పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ కౌంటింగ్‌ను కూడా బహిష్కరించారు.