అది సెలెక్టర్ల నిర్ణయం..! ఒక్క మాటలో తేల్చేసిన సౌరవ్ గంగూలీ

టీమిండియా మేనేజ్‌మెంట్, భారత సెలెక్టర్ల మధ్య వివాదంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పృథ్వీ షాని పంపమని మేనేజ్‌మెంట్ కోరగా.. అందుకు సెలెక్టర్లు ఒప్పుకోలేదు.

ప్రధానాంశాలు: ఇంగ్లాండ్ టూర్ నుంచి గాయంతో శుభమన్ గిల్ ఔట్అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు పృథ్వీ షా కోసం డిమాండ్పృథ్వీ షాని అక్కడికి పంపబోమని స్పష్టం చేసిన సెలెక్టర్లుఅది అంపైర్ల నిర్ణయమేనని గంగూలీ స్పష్టీకరణఇంగ్లాండ్ టూర్‌కి యువ ఓపెనర్ పృథ్వీ షాని పంపకూడదనే నిర్ణయం పూర్తిగా భారత సెలెకర్లు తీసుకున్నదేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు ఆడాల్సి ఉండగా.. ఇటీవల టీమ్‌లోని ఓపెనర్ శుభమన్ గిల్‌కి గాయమైంది. దాంతో.. అతని స్థానాన్నిభర్తీ చేసేందుకు పృథ్వీ షాని ఇంగ్లాండ్‌కి పంపాలని టీమిండియా మేనేజ్‌మెంట్ కోరింది.

కానీ.. ఇంగ్లాండ్‌‌లో ఉన్న భారత జట్టులో రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఈశ్వరన్ అభిమన్యు (స్టాండ్ బై) రూపంలో నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ.. ఎందుకు పృథ్వీ షాని అక్కడికి పంపాలని ప్రశ్నించిన సెలెక్టర్లు.. గిల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అక్కడికి ఎవరినీ పంపేది లేదని స్పష్టం చేశారు. దాంతో.. ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల మధ్య వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా.. అతను ఒక్కమాటలో తేల్చేశాడు.

‘‘ఇంగ్లాండ్ టూర్‌కి పృథ్వీ షాని పంపకూడదు అనేది పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయం’’అని గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. ఈ నెల 13 నుంచి 25వ వరకూ కొలంబో వేదికగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టూర్‌కి పృథ్వీ షా ఓపెనర్‌గా సెలెక్ట్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మీకు డ్యాన్స్, పాడటం రాకపోయినా సరే.. అవి చేస్తే నేను స్టోరీలో పెడతాను: అక్షయ్

Fri Jul 9 , 2021
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. యాక్షన్ హీరోగా బాలీవుడ్‌లో ఆయన ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ‘ఫిలాల్‌-2’ అనే వీడియో సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.