జగన్‌కు తెలంగాణలో వీరాభిమాని.. ఏపీ సీఎం కోసం కాలినడక

సంగారెడ్డి జిల్లాకు చెందిన కిషోర్ జగన్‌కు వీరాభిమాని. జగన్‌ను ఎలా అయిన కలవానుకున్నాడు. దీంతో ఏపీ సీఎంను కలిసేందుకు సొంత ఊరి నుంచి విజయవాడకు కాలినడకన బయలదేరాడు.

ప్రధానాంశాలు:కిషోర్‌ది కందిమండలం మరియు గ్రామం విజయవాడకు కిషోర్ కాలినడక జగన్‌ను కలిసేందుకు యువకుడి పాదయాత్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఏపీ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఆయనకు అటు సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. జగన్ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పాదయాత్రలు కూడా చేస్తున్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో జగనన్నని ఒక్కసారైనా నేరుగా చూడాలంటూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుకున్నాడు.

దీంతో అనుకున్న ప్రకారమే ఈనెల 8వ తేదీన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జగన్ కోసం పాదయాత్ర ప్రారంభించాడు. తన స్వగ్రామం నుంచి సీఎం జగన్‌ను చూసేందుకు కాలినకడన బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్‌ అనే యువకుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోసం ఇలా పాదయాత్ర చేయడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత

Wed Jul 14 , 2021
గత కొంతకాలంగా కొందరు మావోయిస్టు నేతలు అనారోగ్యంతో చనిపోతున్నారు. ఈ క్రమంలోనే రావుల రంజిత్ కూడా అనారోగ్య కారణాలతోనే పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు సమాచారం.