తెలంగాణలో కరోనా కలకలం.. ఇవాళ 6వేలు దాటిన కేసులు

నిన్నటి మీద కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే కరోనా మరణాలు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా వైరస్ బారిన పడి 43 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 14వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

ప్రధానాంశాలు:రాష్ట్రంలో 65597 యాక్టివ్ కేసులు కరోనా నుంచి కోలుకున్న 3804 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,418 పాజిటివ్ కేసులు తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే నిన్నటి కంటే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 73,275 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 6,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 43 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 3,804 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,597కి చేరింది.

కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,01,783కు పెరగింది. ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,418, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్‌ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఫ్రీ వ్యాక్సినేషన్‌కు సిద్ధమైన 17 రాష్ట్రాలు.. టీకాలపై ఆంక్షల ఎత్తివేతకు కారణం ఇదే

Mon Apr 26 , 2021
Vaccination in India దేశంలో కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. మే 1 నుంచి మూడో దశ ప్రక్రియ ప్రారంభం కానుంది.