తెలంగాణలో కరోనా విలయం.. పదివేలు దాటిన పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. కరోనా బారిన పడి తాజాగా 52 మంది చనిపోయారు. గ్రేటర్ పరిధిలో 1440 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకు కేసులు పెరగడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రధానాంశాలు:కొత్తగా 10122 పాజిటివ్ కేసులు 2094కు చేరిన మృతుల సంఖ్యగ్రేటర్ పరిధిలో 1440 కేసులు తెలంగాణలో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు పదివేలకు పైగా నమోదు అయ్యాయి. కొత్తగా 10122 కేసులు రికార్డ్ అయ్యాయి. కరోనా బారిన పడి 52 మంది చనిపోయారు.
సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది.

మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి చేరింది. ఇక తాజాగా 6,446 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,40,590గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 క్రియాశీల కేసులు ఉన్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్‌ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. ఇప్పటి వరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 1,97,894 మంది ప్రాణాలు వదిలారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Mi 11X: ఈరోజే మొదటి సేల్.. రూ.3,500 తగ్గింపు.. ఎలా పొందాలంటే?

Tue Apr 27 , 2021
ఎంఐ 11ఎక్స్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ఈరోజు(ఏప్రిల్ 27వ తేదీ) జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,500 తగ్గింపు లభించనుంది.